Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండా కాలంలో వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా మే నెలలో అయితే ఎండలకు బదులు వానలు కురివాయి. ఇప్పుడు వర్షా కాలం ప్రారంభమైన వర్షాలు కొట్టడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ రైతులు వరుణ దేవుడి వైపు చూస్తున్నారు. రెండు వారాల క్రితం రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోగా.. ప్రస్తుతం ఏం పనులు లేక ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షం
తెలంగాణకు ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడనున్నట్టు తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నట్టు వివరించింది. రేపు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 19న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
ALSO READ: DSP Wife: డీఎస్పీ భార్య ఇలా చేయొచ్చా.. బర్త్‌డే వేడుకల కోసం ఏకంగా, వీడియో వైరల్
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
జూన్ 20న వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 21న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ: DRDO: డీఆర్‌డీవో నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ ఉద్యోగం వస్తే రూ.లక్ష జీతం.. లాస్ట్ డేట్?
పిడుగులు పడే ఛాన్స్
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.