AP CM Chandrababu Missed Train Accident: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద పెను ప్రమాదం తప్పింది. దేవీనగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ఓ రైలు ఎదురుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సమాచారం అందించారు. దీంతో సీఎం పక్కన ఉన్న ర్యాంపు పైకి వెళ్లారు. ఆ తర్వాత కార్యకర్తలు ఎర్ర జెండా పట్టుకొని ఊపారు. సరిగ్గా చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో ట్రైన్ వెళ్లింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మధురానగర్‌లో వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే వంతెనపై నడిచి వెళ్లారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినకుండా రైలు వంతెనపై చంద్రబాబు నడిచి బుడమేరును పరిశీలించారు. ఈ సమయంలో ఆయన రైలు వంతెనపై నడుస్తుండగా.. ఓ రైలు సీఎం చంద్రబాబుకు ఎదురుగా అతి సమీపంగా వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు అతి సమీపంలో రైలు వెళ్లడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. రైలు దాటాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బల్లకట్టుపై వెళ్లిన ఆయన.. అక్కడ గండ్లు పడిన ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలపై చర్చించారు. అలాగే దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు.
Also Read: టీడీపీ హైకమాండ్ ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు
అలాగే కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉధృతిని పరిశీలించారు. భవిష్యత్తులో విజయవాడకు మళ్లీ వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం బుడమేరులో వరద ప్రభావం తగ్గిందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని, ఇప్పటికే ఈ కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించినట్లు గుర్తుచేశారు.