E-Paper
Advertisement

CM Chandrababu: ఐదేళ్లు లేని ఆనందాలను.. ఆరు నెలల్లో అందించాం.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఐదేళ్లు లేని ఆనందాలను.. ఆరు నెలల్లో అందించాం.. సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఏపీలో సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల గురించి వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా సాధించిన రాష్ట్రం ఏపీ అంటూ పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యోగ అవకాశాలు మనం అడగడం కాదు.. ఉద్యోగాలను కల్పించి ఇతర రాష్ట్ర యువతకు కూడా ఉపాధినిచ్చే రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రమంతా నెలకు 3 యూనిట్లు ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన సోలార్ యూనిట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు.

Advertisement

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ బకాయిలు రూ. 6700 కోట్లు విడుదల చేసి, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సైతం పరిష్కరించామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 125 కోట్లు ఒకేరోజు మంజూరు చేసి సామాన్య ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచామని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో వారి నగదు వారికి జమ చేసేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, రైతులు ఈ చర్య పై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు అద్వాన్నంగా ఉన్న రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఇటీవల ప్రతి పల్లెకు రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

Also Read: AP Govt: దీపం 2.o పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇలా తప్పక చేయండి

Advertisement

అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని, విజన్ 2047 కు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందన్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి పల్లె ప్రతి ఇల్లు సంతోషంగా ఉందని, గత ఐదేళ్లలో ఈ స్థాయి ఆనందం రాష్ట్ర ప్రజల్లో లేదన్నారు. దేశంలోని 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనంటూ చంద్రబాబు తెలిపారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, ప్రతినెలా పింఛన్ పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా సాగిస్తుందన్నారు. ఏపీలో కాలుష్య రహిత సమాజం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుందని అందుకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. నారవారి పల్లెకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామానికి చేరుకున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×