CM Chandrababu: కడప మహానాడులో కీలక విషయాలు వెల్లడిస్తున్నారు అధినేత, సీఎం చంద్రబాబు. ఏయే పథకాలు ఎప్పుడు ప్రవేశపెడతామో వాటి గురించి సంకేతాలు ఇస్తున్నారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు పథకం. దీనికి తేదీని ఫిక్స్ చేశారు అధినేత. ఆగష్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కడపలో జరుగుతున్న మహానాడు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న పార్టీ పండుగలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు మహిళలకు శుభవార్త చెప్పారు. ఆగష్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
దీంతో మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదివరకు ఈ విషయాన్ని ప్రకటించారు. కాకపోతే ఆర్థిక సమస్యల వల్ల కాస్త డిలే అయ్యింది. ఈసారి మాత్రం డేట్ కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సివుంది.
తెలంగాణ మాదిరిగా మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా అవకాశం ఉంటుందా? ఏమైనా పరిమితులు విధిస్తారా? అనేది ఇప్పుడు కీలకమైన పాయింట్. ఈ స్కీమ్ గురించి రెండు వారాల కిందట ఆర్టీసీ విభాగానికి చెందిన అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత సర్వీసు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వివరించారు అధికారులు.
ALSO READ: శ్రీవారి భక్తుడికి కష్టాలు.. తిరుపతిలో నగలు చోరీ, బాధితులు హైదరాబాద్ వారు
ఆర్టీసీ ప్రస్తుతం ఆక్యుపెన్సీ ఎంత వుందని ఆరా తీశారు. ఈ స్కీమ్ అమలకు ముందు, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ప్రయాణికులు పెరిగిన సందర్భాన్ని వివరించారు. దీనివల్ల ప్రయాణికులు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు.
ఎలాంటి పరిమితులు లేకుండా పొరుగున ఉన్న తెలంగాణ ఉచితంగా అందిస్తోందని, ఆంక్షలు పెడితే బాగోదని అన్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి బస్సులు వాటిపై ఆరా తీశారు. మహానాడు తర్వాత డీటేల్స్ రిపోర్టు అధికారులు ముఖ్యమంత్రికి ఇవ్వనున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.
తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని హామీ ఇచ్చింది టీడీపీ. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో దీన్ని చేర్చారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనుంది.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తాం : సీఎం చంద్రబాబు
దీపం పథకం కింద ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం
మహానాడులో మగవారి కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలోనే వస్తుంది
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవారితో సమానంగా ఆడవాళ్లు… pic.twitter.com/MIO2Oz6CO8
— BIG TV Breaking News (@bigtvtelugu) May 28, 2025