Indian Railways: రైల్వే ప్రయాణీకుల కోసం IRCTC పలు క్రెడిట్ కార్డులను అందిస్తోంది. HDFC, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, RBL బ్యాంక్‌లతో సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేస్తోంది. ఈ కార్డులు తరచుగా ట్రైన్ జర్నీ చేసే ప్రయాణీకులకు పలు ప్రయోజనాలను అందిస్తాయి. వినియోగదారులు టికెట్ బుకింగ్‌ల మీద ట్రావెల్ పాయింట్లు సంపాదిస్తారు. వీటిని భవిష్యత్ ప్రయాణాల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. లాయల్టీ వినియోగదారులు ఇతర అంశాల మీద కూడా పాయింట్లు సంపాదించే అవకాశం ఉంటుంది.
IRCTC క్రెడిట్ కార్డులతో ప్రయోజనాలు
⦿ IRCTC HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డు కావాలంటే ముందుగా ₹500 చెల్లించాల్సి ఉంటుంది. కార్డ్ జారీ చేసిన మొదటి 37 రోజుల్లోపు కార్డ్ యాక్టివేషన్ పై ₹500 విలువైన వెల్ కం ఆఫర్ వోచర్ ను పొందే అవకాశం ఉంటుంది. IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో టికెట్లపై ఖర్చు చేసే ప్రతి ₹100కు ఐదు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రతి ₹100 కు ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. IRCTC రైలు టికెట్ బుకింగ్ లపై 1% లావాదేవీ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. ఏడాదికి ఎనిమిది సార్లు IRCTC ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఫరీ యాక్సెస్ ఉంటుంది. మూడు నెలల్లో ₹30000 ఖర్చులపై ₹500 గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.
⦿ IRCTC RBL కార్డ్: ఈ కార్డు కోసం ముందుగా ₹500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 500 రివార్డ్ పాయింట్ల వెల్ కం ఆఫర్ లభిస్తుంది. IRCTC వెబ్ సైట్‌లో ఖర్చు చేసే ₹200 కు ఐదు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఫ్లైట్/హోటల్/క్రూయిస్ టికెట్ బుకింగ్ పై ఖర్చు చేసిన ₹200 పై రెండు రివార్డ్ పాయింట్లు అందుతాయి. IRCTC రైలు టికెట్ బుకింగ్‌లపై 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. ఏడాదికి ఎనిమిది సార్లు IRCTC లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ₹5000 వరకు రైలు రద్దుకు ఉచిత రక్షణ కవరేజ్ ఉంటుంది. FASTAG రీఛార్జ్/NCMC రీలోడ్/UTS యాప్‌లో ఖర్చు చేసే ₹200 పై మూడు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతర కేటగిరీలలో ఖర్చు చేసే ప్రతి ₹200 పై ఒక రివార్డ్ పాయింట్ లభిస్తుంది.
⦿ IRCTC BOB కార్డ్: ₹500 జాయినింగ్ ఫీజు, ₹300 రెన్యూవల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కార్డు కొనుగోలు చేసిన తర్వాత 500 బోనస్ రివార్డ్ పాయింట్ల వెల్ కమ్ వోచర్ లభిస్తుంది. IRCTC టికెట్లపై ఖర్చు చేసే ప్రతి ₹100పై 40 BOBCARD రివార్డ్ పాయింట్లు వరకు లభిస్తాయి. IRCTC రైలు టికెట్ బుకింగ్‌లపై 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. ప్రతి ఏటా నాలుగు సార్లు ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇతర కేటగిరీలలో ఖర్చు చేసే ప్రతి ₹100పై నాలుగు రివార్డ్ పాయింట్లు అందుతాయి.
⦿ IRCTC SBI కార్డ్ ప్రీమియర్: కార్డు కోసం రూ. 1499 చెల్లించాల్సి ఉంటుంది. 1500 బోనస్ రివార్డ్ పాయింట్ల వెల్ కమ్ వోచర్ లభిస్తుంది. IRCTC టికెట్లపై ఖర్చు చేసే ప్రతి ₹100 పై పది రివార్డ్ పాయింట్లు, విమాన టికెట్లు, ఇ-క్యాటరింగ్ పై ఖర్చు చేసే ప్రతి ₹100 పై ఐదు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపు అందిస్తుంది. ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌లకు ప్రతి సంవత్సరం ఎనిమిది సార్ల వరకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ₹125 సాధారణ ఖర్చులపై ఒక రివార్డ్ పాయింట్లభిస్తుంది.
⦿ IRCTC SBI కార్డ్ (RuPay): ఈ కార్డు కోసం ₹500 రెన్యువల్ కోసం ₹300 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్‌పై 350 బోనస్ రివార్డ్ పాయింట్ల లభిస్తాయి. IRCTC టికెట్లపై ఖర్చు చేసే ₹100 కు పది రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. IRCTC రైలు టికెట్ బుకింగ్‌లపై 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. రూ. 125 సాధారణ ఖర్చులపై ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌లకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు వరకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది.
⦿ IRCTC SBI కార్డ్: ₹500/₹300 జాయినింగ్/రెన్యూవల్ ఫీజు ఉంటుంది. కార్డ్ యాక్టివేషన్‌పై 350 బోనస్ రివార్డ్ లభిస్తుంది. IRCTC టికెట్లపై ఖర్చు చేసే ₹100 కు పది రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. IRCTC రైలు టికెట్ బుకింగ్ పై 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌లకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ₹125 సాధారణ ఖర్చులపై ఒక రివార్డ్ పాయింట్ లభిస్తుంది.
Read Also: భారతీయ రైల్వే మరో ఘనత, అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను ప్రారంభించిన ప్రధాని!