E-Paper
Advertisement

వైసీపీ నిరసనలపై గాలి తీసేసిన సీఎం చంద్రబాబు.. గొడ్డలి పట్టుకుని రోడ్లపై రప్పా రప్పా తిరగడానికా?

వైసీపీ నిరసనలపై గాలి తీసేసిన సీఎం చంద్రబాబు.. గొడ్డలి పట్టుకుని రోడ్లపై రప్పా రప్పా తిరగడానికా?
Advertisement

CM Chandrababu: డీఎస్సీ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. దీని పేరిట వైసీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టారు. తాము డీఎస్సీ నిర్వహించి ఏడాది అయ్యిందని, ఏడాది తర్వాత రోడ్డు మీదకు రావడం ఏంటని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ మాదిరిగా ఏపీలో ఏదో జరిగిపోయిందని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడంపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీని తాము పారదర్శకంగా నిర్వహించామని తేల్చేశారు.

 

వైసీపీ నిరసనలపై గాలి తీసేసిన సీఎం చంద్రబాబు

Advertisement

వైసీపీ వ్యవహారశైలిపై మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చినవారు సైతం ర్యాలీలు చేశారని వివరించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఉద్యోగులు వైసీపీని సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి సిగ్గు ఉన్నవాళ్లు ఎవరైనా ఒప్పు కోవాలన్నారు. మళ్లీ ఇవాళ ఆందోళనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రోడ్లపై ర్యాలీల పేరిట స్వైర విహారం చేయడానికి, గొడ్డలి పట్టుకుని రప్పా రప్పా తిరగడం కోసమా అంటూ మండిపడ్డారు.

 

ర్యాలీ పేరిట గొడ్డలి పట్టుకుని రోడ్లపై రప్పా రప్పా తిరగడానికా?

Advertisement

తాను అలాగ చూస్తుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. వారు ఎవరినీ నిద్ర పోనివ్వరని అన్నారు. ఈ విధంగా ఆ పార్టీ ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మేమే కట్టానని అంటున్నారని, రేపు పోలవరం పూర్తి అవుతుందని, అది తానే కట్టానని అంటారని ఎద్దేశా చేశారు.

 

కైకలూరు నియోజకవర్గంలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

సోమవారం కైకలూరు నియోజకవర్గంలోని  కలిదిండిలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలని 350 సార్లు కోర్టులకు వెళ్లారని గుర్తు చేశారు. అన్ని క్లియర్ అయిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సూపర్‌ స్పీడ్‌లో పరుగెడుతోందని, రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు పని చేయాల్సిందేనని తేల్చేశారు. పట్టాదారు పాసు పుస్తకంపై వేరే వాళ్ల ఫొటో వేసుకుంటే ఊరుకుంటామా? వైసీపీ ప్రభుత్వ విధ్వంసం వల్ల అనేక సమస్యలు వచ్చాయని, ఎక్కువగా భూసమస్యలపై ఉన్నాయన్నారు.

ALSO READ: మా బాధను రాజకీయం చేయవద్దు.. దండం పెడతా-మెడికో ప్రియాంక తండ్రి

ఎట్టి పరిస్థితుల్లో భూసమస్యలను పరిష్కరించాలని అనుకున్నామని తెలియజేశారు. సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారని, లేకుంటే 11కి పరిమితం చేశారని వైసీపీ సెటైర్లు వేశారు. బటన్ నొక్కడం, పరదాల చాటున వచ్చి సభలు పెట్టడం, చెట్లు నరికేయటం గత పాలకులు చేశారని గుర్తు చేశారు.

తాము ప్రతీ నెలా ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఈ సమావేశాల ద్వారా వారిని కలుస్తున్నామని వివరించారు. కరెన్సీ నోట్లకు ఉండే భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని, క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

 

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×