Cm Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నేడు హస్తినకు వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. సభలో ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ లు ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు. ఉద్యోగుల సర్వీస్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా బడ్జెట్ కేటాయింపులపై ఈ సభలో చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం చంద్రబాబు సచివాలయం ఎదురుగా ఉన్న హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
Also read: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి రూ.30 కోట్లు
అక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం 3:45 గంటలకు ఢిల్లీ చేరుకుని, 4 గంటలకు ఓ మీడియా ప్లాన్ కేవ్ లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ అవ్వబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు తదితర అంశాలపై కేంద్రం మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. అంతే కాకుండా రేపు ఆయన ఢిల్లీ నుండి నేరుగా మహారాష్ట్ర వెళ్లనున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఏపీలో కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముందుంచే అవకాశం ఉంది. అంతే కాకుండా ఎన్డీఏ సర్కార్ పనితీరుపైనా చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు సైతం అక్కడ ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.