BigTV English

BB Telugu 8 Promo: జీవితంలో మరిచిపోలేని సర్ప్రైజ్.. ఎమోషనల్ అయిన ప్రేరణ..!

BB Telugu 8 Promo: జీవితంలో మరిచిపోలేని సర్ప్రైజ్.. ఎమోషనల్ అయిన ప్రేరణ..!

BB Telugu 8 Promo: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకుంది ఈ షో. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుని, 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే మరో నెలలో బిగ్ బాస్ సీజన్ 8 కాస్త పూర్తీ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే 11వ వారానికి సంబంధించి ఫ్యామిలీ వీక్ ను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కాని కంటెస్టెంట్ల కోసం వారి తల్లిదండ్రులను హౌస్ లోకి వస్తూ ఉండగా.. పెళ్లయిన కంటెస్టెంట్ల కోసం వారి భర్త లేదా భార్య హౌస్ లోకి అడుగుపెడుతూ గేమ్ గురించి తమ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ.. బయట ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది.. తాము ఎలా ఆడుతున్నాము అనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.


ఇక నిన్నటికి నిన్న బిగ్ బాస్ సీజన్ 8.. 11 వ వారానికి సంబంధించి ముక్కు అవినాష్ భార్య అను హౌస్ లోకి అడుగుపెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది. అవినాష్ పడుకొని ఉండగా.. అవినాష్ పక్కనే పడుకొని చేయి వేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక తర్వాత వీరిద్దరి కోసం ఒక మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్.. ఇది చూడడానికి అటు ఆడియన్స్ కి కూడా చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడు ప్రేరణ వంతు వచ్చింది. చుట్టూ రంగురంగుల బెలూన్స్ తో చాలా అందంగా ముస్తాబు చేశారు. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పరవశించిపోయిన ప్రేరణకు బిగ్ బాస్ తన జీవితంలో మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రేరణ భర్త వచ్చేసారు. ఇక భర్తను చూడగానే గట్టిగా అరుచుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంది ప్రేరణ. దాదాపు పది వారాలుగా భర్తకి దూరంగా ఉంటున్న ఈమె సడన్గా తన భర్తను చూసేసరికి ఎమోషనల్ అయింది. అంతేకాదు వీరిద్దరూ తమ జీవితంలో మరిచిపోలేనంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ ప్రేరణ , ఆమె భర్త మధ్య ఒక చిన్న గేమ్ కూడా నిర్వహించారు బిగ్ బాస్. ఇద్దరి మధ్యలో బెలూన్స్ పెడుతూ వాటిని పగలగొట్టాలి అంటూ సూచించారు. ఇక ఈ ఆట చాలా రొమాంటిక్గా సాగింది.. ఇది చూసిన అవినాష్ బిగ్ బాస్.. మళ్ళీ అనుని హౌస్ లోస్ లోకి పంపించండి అంటూ కామెంట్లు చేశారు. ఇక పెళ్లి కాని కంటెస్టెంట్స్ వీరిని చూసి పక్కకు వెళ్ళిపోయారు మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.


ఇకపోతే హౌస్ లో ప్రేరణ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ శివంగి లా దోచుకుపోతూ.. తనదైన ఆట తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఫిజికల్ టాస్క్ లో శరీరం మొత్తం కందిబారినా.. తన ఆటను ఈమె విడవలేదు. అలా అందరి ప్రశంసలు అందుకుంటూ ఇప్పుడు దోసుకుపోతోంది. ఇక ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×