BigTV English

Pulivendula Politics : టార్గెట్ పులివెందుల.. సీఎం చంద్రబాబు వ్యూహం అదేనా ?

Pulivendula Politics : టార్గెట్ పులివెందుల.. సీఎం చంద్రబాబు వ్యూహం అదేనా ?

Pulivendula Politics(Andhra pradesh political news) : పులివెందుల.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానిదే అధికారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు వారిదే. మరి ఈ గెలుపుకు అసలు కారణమేంటి ?నిజంగా అభిమానంతోనే వారి కుటుంబాన్ని గెలిపిస్తున్నారా ? చంద్రబాబు పులివెందులపై చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి ? దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ?


పులివెందులలో జగన్‌ గెలుపుకు కారణం ఇదే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తుందంటున్నారు. వారి గెలుపుకు అభిమానం కారణం కాదని.. కేవలం భయపెట్టి మాత్రమే గెలుస్తూ వస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటే.. అందులో ఏడింటిని గెలుచుకుంది టీడీపీ. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఈ గెలుపు సాధ్యమైందన్నది చంద్రబాబు మాట. అంతేకాదు త్వరలో పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే చంద్రబాబు కాన్సెప్ట్ ప్రకారం.. త్వరలో పులివెందుల ప్రజల్లో భయాన్ని తొలగిస్తామని చెప్పకనే చెబుతున్నారు.


Also Read : హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్

టు బీ ఫ్రాంక్.. జగన్‌ను ఇప్పటికే దారుణంగా ఓడించారు చంద్రబాబు. కానీ.. ఇప్పుడు ఆయన తిరిగి కోలుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల ముందు వివేకానంద ఎపిసోడ్‌ను తనకు ఎలా అనుకూలంగా మలుచుకున్నారో మరోసారి గుర్తు చేశారు.

WHO KILLED BABAYI అనే క్వశ్చన్‌కి త్వరలోనే ఆన్సర్ వస్తుందంటున్నారు చంద్రబాబు. అంటే జగన్‌కు మోరల్‌గా మరో దెబ్బ పడనుందా? అనే క్వశ్చన్ తెరపైకి వచ్చేసింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పటికే ఏపీ ప్రజల్లో దీనిపై చర్చ మొదలైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందని సీబీఐ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అరెస్ట్‌ చేసేందుకు కూడా రెడీ అయ్యింది. కానీ ఆయన కోర్టును ఆశ్రయించి చెరసాలకు చేరకుండా బయటే ఉండిపోయారు. కానీ.. ఇంకెంత కాలమో అది కొనసాగదని చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది.

ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే.. పార్టీ పరంగా వైసీపీకి.. వ్యక్తిగతంగా జగన్‌కు అది పెద్ద దెబ్బే. ఎందుకంటే అవినాష్‌ రెడ్డిని మొదటి నుంచి వెనకేసుకువస్తున్నారు జగన్. అవినాష్‌ కోసం సొంత చెల్లెని, బాబాయ్‌ కూతురిని కూడా వదులుకున్నారు. అందుకే ఈ కేసులో అవినాషే నేరస్థుడని తెలితే అది జగన్‌కు పెద్ద దెబ్బ.. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేరుగా జగన్‌ కుంభస్థలంపై కొట్టేందుకు ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Also Read : ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్

మీకు గుర్తుండి ఉండే ఉంటుంది. ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబును మట్టి కరిపించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్‌ చేశారు. కుప్పంలో చాలా మంది వైసీపీలో చేరేలా చేశారు. కానీ తీరా ఎలక్షన్స్ వచ్చే సమయానికి పరిస్థితి మొత్తం తలకిందులైంది. కుప్పంలో చంద్రబాబు గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోయారు. మరి ఈ విషయాలను గుర్తు పెట్టుకున్నారనుకుంటా చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా పులివెందులపైనే ఫోకస్ చేశారు.

పులివెందులలో ఎలాగైతే బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారో.. అదే కాన్సెప్ట్‌ని కుప్పం, మంగళగిరితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్‌ చేయాలని ప్రయత్నించారన్నది చంద్రబాబు ఆరోపణ. ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం. ఇప్పుడు పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకోస్తామంటున్నారు. చంద్రబాబు మాటలను జగన్‌ సీరియస్‌గా తీసుకుంటే.. రాష్ట్రంతో పాటు.. సొంత నియోజకవర్గానికి కూడా జగన్ టైమ్‌ కేటాయించాల్సి ఉంటుంది. లోకల్‌గా పర్యటించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జగన్‌ను పులివెందులకే పరిమితం చేసే ఎత్తుగడనా? అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏదేమైనా చంద్రబాబు తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారో చూడాలి.

Related News

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు ఇవే

Iconic Cable Bridge: కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. సీఎం చంద్ర‌బాబు అదిరిపోయే ప్లాన్‌

AP Assembly Sessions 2025: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

AP Govt: ఏపీలో సందడే సందడి.. ఇల్లు కట్టుకునేవారికి పండగే, ఇంకెందుకు ఆలస్యం

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Big Stories

×