BigTV English

Chandrababu: ప్రజల్ని మోసం చేయాలని చూస్తే తోక కత్తిరిస్తా జాగ్రత్త.. చంద్రబాబు హెచ్చరిక

Chandrababu: ప్రజల్ని మోసం చేయాలని చూస్తే తోక కత్తిరిస్తా జాగ్రత్త.. చంద్రబాబు హెచ్చరిక

తాను చాలా జాగ్రత్తగల మనిషినని.. తన చుట్టూ ఎవరున్నారో కూడా జాగ్రత్తగా గమనిస్తుంటానని, అలాంటి తననే వైఎస్ వివేకా హత్య విషయంలో మోసం చేశారని అన్నారు సీఎం చంద్రబాబు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారని సాక్షి పేపర్లో వార్తలిస్తూ, వైసీపీ నేతలు చెబుతుంటే నిజమేననుకున్నానని, కానీ మధ్యాహ్నానికి ప్లేటు తిప్పేశారని, సాయంత్రానికి తన చేతిలో కత్తి పెట్టిన ఫొటోలు చూపిస్తూ నారాసుర రక్త చరిత్ర అంటూ వార్తలిచ్చారని అన్నారు. వైసీపీకి చెందిన సాక్షి పేపర్ అన్నీ అవాస్తవాలే ప్రచురిస్తుందని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ నెల్లూరు టూర్ లో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన వీడియోలు ప్లే చేశారని, ఆ పేపర్ చదివితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, గూడెం చెరువు గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నామని, గండికోటలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం పెట్టబోతున్నామని.. కడప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారాయన. ఎన్టీఆర్ ఆలోచనతో పుట్టిన ప్రాజెక్ట్ లు తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా అని గుర్తు చేశారు చంద్రబాబు.


జగన్ రాజకీయాల్లో ఉండాలా?
నెల్లూరు జిల్లాలో ఓ మహిళా నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్ వెళ్లారని, ఇంకా తిట్టాలంటూ ఆయన్ని ప్రోత్సహించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. తిట్టేవారికి తాను అండగా ఉంటానని చెప్పి, ఆంబోతులా రెచ్చిపో అంటూ అభయమిచ్చే దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండాలా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం కష్టం అని, విధ్వంసం చేయడం ఒక నిమిషం పని అని అన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో అదే జరిగిందన్నారు. రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, సమస్యలు సృష్టించారని, 10 లక్షల కోట్లు అప్పు చేశారని, కేంద్రం ఇచ్చే పథకాలను ఆపేశారని విమర్శించారు చంద్రబాబు.


రైతుకి రూ.20వేలు
గతంలో జగన్‌ రైతులను మోసం చేశారని, రైతు భరోసా పేరుతోనూ చేసింది వంచనే అని అన్నారు సీఎం. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పేరుతో భారీ ప్రయోజనం చేకూర్చబోతున్నామని చెప్పారు. కేంద్రం ఇచ్చే 6వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14వేల రూపాయలు కలిపి రూ.20వేలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఏడున్నర వేలు ఇచ్చిందని, తాము దాన్ని రెట్టింపు చేస్తున్నామని అన్నారు. ఎవరిది రైతు ప్రభుత్వమో, ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. తాను ప్రభుత్వ స్కూల్ లో చదువుకున్నానని, ఇక్కడున్నవారిలో చాలామంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నారని, వారంతా ఉన్నత స్థితికి చేరుకున్నారని, అలాంటి వారు తమ చుట్టుపక్కల వారికి చేయూతనివ్వాలన్నారు. అలాంటి చేయూత వల్లే నాడు అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకోగలిగారని చెప్పారు.

గివ్ బ్యాక్..
ఎంత డబ్బు ఉన్నా మనం తినగలిగిందే తింటామని, అతిగా తినలేమని, ఒకవేళ తింటే రోగాలపాలవుతామని చెప్పారు చంద్రబాబు. సమాజానికి తిరిగవ్వాలని, గివ్ బ్యాక్ అనేది మన నినాదం కావాలన్నారు. సాయం చేయడం అనేది అందరూ అలవాటు చేసుకుంటే, సమాజంలో పేదవారెవరూ ఉండరని వివరించారు. సింగపూర్ తలసరి ఆదాయంలో తెలుగువారిదే ఆధిపత్యం అని నాలెడ్జ్ ఎకానమీ అంటే అదేనని, మనవాళ్లు అక్కడికి వెళ్లి గొప్పవారయ్యారని చెప్పారు. తనది ముందు చూపు అని, ఊహాగానం కాదని అన్నారు చంద్రబాబు.

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×