BigTV English

CM Chandrababu: ఎక్కడైనా మనదే గెలుపు.. ఇన్వెస్టర్లకు బాబు బంపరాఫర్

CM Chandrababu: ఎక్కడైనా మనదే గెలుపు.. ఇన్వెస్టర్లకు బాబు బంపరాఫర్

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ఇవాళ దావాస్ టూర్లో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో దేశానికి సరైన ప్రధాని దొరికారని చెప్పుకొచ్చారు. పరిపాలనపై మోడీకి స్పష్టత ఉందని కొనియాడారు. ఇక చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది.. కానీ, ఇండియాలో రాజకీయ సందిగ్ధత లేదని అన్నారు. మరోవైపు టాటా సంస్థతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.


పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్‌ 2047 విజన్‌ మేరకు ముందుకు సాగుతామన్నారు. ఏపీలో విద్యుత్‌ ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయని అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ లో హరిత పారిశ్రామిక విధానంపై దావోస్ లో మాట్లాడిన ఆయన.. 115 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు. 500 మెగావాట్లు, 5 MPTA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు.

25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టారని చెప్పారు చంద్రబాబు. 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండింటిని అవకాశంగా తీసుకుని తాము రెండవ దశ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. తాను తెచ్చిన సంస్కరణలతో రెండున్నర దశాబ్ధాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్‌ రూపొందించడంలో ట్రాక్ రికార్డ్ ఉందని, హైదరాబాద్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ నగరం అయ్యిందని అన్నారు. ఫార్మా, ఐటీ, ఫైనాస్స్, క్రీడలు, ఆసుపత్రలు ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని చెప్పారు.


Also Read: దావోస్‌లో సీఎం చంద్రబాబు మనసులో మాట

భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ దోహదపడుతుందన్నారు. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్‌సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. పేదరికం, సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కార్పొరేట్ సంస్థలు, అధిపతులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×