BBL: బిగ్ బాష్ లీగ్ 2024 – 2025 టోర్నమెంట్లో ( Big Bash League 2024 – 2025 tournament ) అరుదైన సంఘటన జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా… క్వాలిఫైయర్ మ్యాచ్ జరగగా… అందులో ఓ బాటర్ సిక్స్ కొడితే ఫ్యాన్ అందుకునే ప్రయత్నం చేశాడు. సిక్స్ గేట్ లో ఉన్న… ఓ అభిమాని మ్యాచ్ చూస్తూ… బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే సిక్స్ వెళ్లిన ఆ బంతిని క్యాచ్ పట్టబోయి.. మెట్లపై జారిపడ్డాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Mohammed Shami: గుడ్ న్యూస్..400 రోజుల తర్వాత టీమిండియా జెర్సీలో షమీ !
ఈ క్యాచ్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్ బాష్ లీగ్ 2024 – 2025 టోర్నమెంటులో ( Big Bash League 2024 – 2025 tournament ) భాగంగా ఇవాళ… హోబర్ట్ హరికేన్స్ ( Hobart Hurricanes ) అలాగే సిడ్నీ సిక్సర్స్ ( Sydney Sixers ) మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఓవల్ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… టాస్ గెలిచి సిగ్ని సిక్సర్స్ బౌలింగ్ తీసుకుంది. దీంతో హరి కేన్స్ బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఒక అభిమాని స్టాండ్‌లో సిక్స్ పట్టుకోవడానికి ప్రయత్నించి, చివరికి పడిపోయిన ఘటన మ్యాచ్ ప్రారంభంలో జరిగింది.
కాగా, హరికేన్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బెన్ ద్వార్షుయిస్ ( Ben Dwarshuis ) బౌలింగ్‌లో 75 మీటర్ల సిక్సర్‌ను పర్ఫెక్ట్ ఎక్జిక్యూట్ పుల్ షాట్‌తో కొట్టాడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిచెల్ ఓవెన్ ( Mitchell Owen ). దింతో బంతి ప్రేక్షకుల్లోకి ఎగిరింది. ఈ తరుణంలోనే ఒక అభిమాని… ఆ క్యాచ్‌ను పట్టడానికి అద్భుతమైన ప్రయత్నం చేశాడు. కానీ అక్కడే ఉన్న మెట్ల పైన పడ్డాడు ఆ అభిమాని. కానీ అదృష్టవశాత్తు ఆ అభిమానికి గాయాలు కాలేదు.
Also Read: U19 Women’s T20 World Cup 2025: వైష్ణవికి హ్యాట్రిక్.. మలేషియాపై 2 ఓవర్లలోనే టీమిండియా విక్టరీ
ఎప్పటి లాగే కింద పడ్డ స్థానం నుంచి… లేచి తన సీట్ లో కూర్చున్నాడు ఆ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన… క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో జస్ట్ మిస్.. క్యాచ్ పడితే అయిపోయేది… కొంచంలో అదృష్టాన్ని మిస్ చేసుకున్నాడు.. కాస్త ట్రై చేస్తే బాగుండేది… అంటూ రకరకాలుగా ఆ అభిమానిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ( BBL )
ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో హోబర్ట్ హరి కేన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన హరి కేన్స్.. 173 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ నష్టపోయి 173 పరుగులు చేయడం జరిగింది. అయితే… ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… సిడ్నీ సిక్సర్స్ విఫలమైంది. దీంతో నిర్మిత 20వ వలలో ఐదు వికెట్లు నష్టపోయి 161 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ 12 పరుగులు తీయడంతో విజయం సాధించింది.
The disappointment of dropping a catch. 😄pic.twitter.com/m7psBuX7i5
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025