CM Chandrababu: భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల న్నారు సీఎం చంద్రబాబు. పీ4 మోడల్ ద్వారా సమాజంలో ఊహించని మార్పులు వస్తాయని మనసులోని మాట బయటపెట్టారు. దీని ద్వారా అసమానతలు తగ్గుతాయ న్నారు.
దావోస్‌లో సీఎం చంద్రబాబు టీమ్ పర్యటిస్తోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయులు వ్యాపారంలో బాగా రాణిస్తారని, ఆ లక్షణాలు వారిలో పుష్కలంగా ఉన్నాయన్నారు.
మీ అందర్నీ చూస్తుంటే తనకు నమ్మకం పెరిగిందని, భవిష్యత్‌లో నా కలలు నిజమవు తాయన్నారు సీఎం. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. 25 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రెండున్నర దశాబ్దాల కిందట బిల్ గేట్స్ ద్వారా ఐటీ సేవలు తీసుకొచ్చామన్న సీఎం, త ద్వారా రూపు రేఖలు మారిపోయాయని వివరించారు.
రెండంకెల వృద్ధి రేటు సాధిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలో అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. ఇండియాలో మోదీ నాయకత్వంలో భారత్ స్థిరమైన ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ALSO READ: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి
ఓ వైపు దావోస్ సదస్సులో మాట్లాడుతూ మరోవైపు బిజినెస్‌మేన్లతో సమావేశం అవుతున్నారు. ఏపీకి సంబంధించి అన్ని విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మరోవైపు వివిధ పారిశ్రామిక వేత్తలతో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమవుతున్నారు.
"Centre for Global Leadership on Competitiveness"లో భాగస్వామ్యం అవ్వటానికి ముందుకు వచ్చిన "IMD Business School, Switzerland" #InvestInAP#APatWEF#WEF25 #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/R2RkhcjqTX
— Telugu Desam Party (@JaiTDP) January 21, 2025