CM Chandrababu: ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల కోరిక నెర వేరింది. ఆదివారం ఉదయం వేకువజామున కుప్పంలోని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. చంద్రబాబు ఫ్యామిలీ సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేశారు. శుభ కార్యక్రమానికి వచ్చే వారి కోసం పసందైన విందు వంటకాలను సిద్ధం చేశారు.
కుప్పంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో అడుగుపెట్టారు. ఇంట్లో నిర్వహించిన పూజలో సీఎం దంపతులుతోపాటు కొడుకు లోకేష్-కోడలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాను పుట్టిన ఊరులో సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. కాకపోతే సమయం కుదరలేదు. చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా బీజీగా ఉన్నారు. శాశ్వత నివాసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నారు.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కుప్పంలో నూతన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మంచి ముహుర్తంలో సమయంలో ఇంట్లోకి గోవులను అడుగు పెట్టించిన తర్వాత చంద్రబాబు దంపతులు కాలు పెట్టారు. ఆ తర్వాత పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు చేశారు.
ALSO READ: టీటీడీ కీలక నిర్ణయం.. ఎన్నారై భక్తుల కోసం ప్రత్యేకంగా సేవ
కొత్త ఇంటి గృహ ప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికి కుప్పం చేరుకున్నారు. గత రాత్రి పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. నూతన గృహానికి వెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అమరావతి నుంచి లోకేశ్- బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం రాత్రి కుప్పం చేరుకున్నారు.
మరో వైపు గృహ ప్రవేశం నేపథ్యంలో సుమారు 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. వచ్చే అతిథుల కోసం వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను రెడీ చేశారు. భువనేశ్వరి దగ్గరుండి వంటకాలను సిద్ధం చేయించాయి. సొంత నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా గృహ ప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలికారు టీడీపీ శ్రేణులు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు మంత్రి లోకేష్. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని రాసుకొచ్చారు. ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో మా సొంతింటి గృహప్రవేశం జరిగిందన్నారు. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయన్నారు. ఇది మా కుటుంబ పండగ కాదు, మనందరి పండగ అని, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయని రాసుకొచ్చారు.
Kuppam is our home, and the people of Kuppam are our family.
The housewarming ceremony in Kuppam brought me immense joy. It was a heartfelt celebration, blessed by the people of Kuppam, who have been our pillars of support for 36 years, guiding us every step of the way. I'm… pic.twitter.com/OtqeBfCfbc
— Nara Bhuvaneswari (@ManagingTrustee) May 25, 2025