BigTV English

CM Chandrababu: ఇది కదా అసలైన అభివృద్ది అంటే.. ఊహించిన దాని కన్నా..!: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఇది కదా అసలైన అభివృద్ది అంటే.. ఊహించిన దాని కన్నా..!: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన అంటే  ఎలా ఉంటుందో ఏడాదిలోనే నిరూపించుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంద్రప్రదేశ్ విజన్ 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఊహించిన దాని కన్నా  ఎక్కువ చేశామని అన్నారు. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా అమరావతిలో కూటమి సర్కార్ నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్తేమీ కాదని.. నాలుగు సార్లు సీఎంగా పని చేసినట్టు ఆయన గుర్తు చేశారు. తను ముఖ్యమంత్రిగా చేసిన అన్ని పర్యాయాలు సుపరిపాల అందించానని పేర్కొన్నారు.


మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. పరిష్కారం చూపిస్తామని చెప్పారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని అన్నారు. మూడు రాజధానుల నమూనాతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిదని చెప్పారు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి నీటి సమస్యకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు . 2022-23కు నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ALSO READ: Pawan Kalyan: యువతకు భారీ గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన


రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన నాలుగు సంతకాలు పెట్టినట్టు గుర్తు చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని అన్నారు. ప్రస్తుతం వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 213 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 భోజనం పెడుతున్నామని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర రూ.11,400 కోట్ల సాయం చేసిందని తెలిపారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాంమని.. అది త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు కేటాయించినట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌ పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు.  ‘తల్లికి వందనం’ హమీని పూర్తిగా నిలబెట్టుకున్నామని అన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి రూ.15వేల కోట్లు వచ్చాయని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్ట్ పై కూడా మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అని అన్నారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ‘గోదావరి జలాల వినియోగంతో రెండు రాష్ట్రాల బాగుపడతాయి. మిగులు జలాలు రెండు రాష్ట్రాలూ వాడుకోవచ్చు. ఈ నది నుంచి ఏటా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. ఎంతగా వాడుకున్నా 200 టీఎంసీల మాత్రమే వాడుకోగలం. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా.. కోస్తాంధ్రను ఆక్వా కల్చర్ హబ్‌గా మారుస్తాం’ అని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఆదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఏపీలో తలసరి ఆదాయం రూ.2.6లక్షలు ఉందని.. 2047 నాటికి రూ.55లక్షలు కావాలని అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని చెప్పారు. ధనవంతుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు.. పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాడు.. సమాజం అండతో పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని సీఎం అన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×