Rishabh Pant Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ప్రైవేట్ లీగ్ లో 27 కోట్లు తీసుకున్నప్పటికీ… జాతీయ జట్టుకు మాత్రం తన డ్యూటీ కొనసాగిస్తున్నాడు. అందరూ విఫలమవుతున్న.. టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ మాత్రం అదరగొడుతూ ముందుకు వెళ్తున్నాడు. ఏమాత్రం ఇంగ్లాండు జట్టుకు… ఛాన్స్ ఇవ్వకుండా చేస్తూ.. దూసుకు వెళ్తున్నాడు రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ గడ్డపై రెండు వరుస సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్.
Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
ఇంగ్లాండ్ గడ్డపై వరుస రెండు సెంచరీలు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో టీమిండియా జట్టు ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండవ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది టీం ఇండియా. అయితే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్… మొదటి టెస్టులో రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రిషబ్ పంత్… రెండో ఇన్నింగ్స్ లో కూడా తన సెంచరీ నమోదు చేసుకున్నాడు.
దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఓకే మ్యాచులు రెండు వరుస సెంచరీలు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 130 బంతుల్లో 13 బౌండరీలు అలాగే రెండు సిక్సర్లతో శతకం నమోదు చేసుకున్నాడు రిషబ్ పంత్. అదే సమయంలో టీమిండియా మరో ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడంతో టీమిండియా స్కోర్ మూడు వికెట్లు నష్టపోయి 264 కు చేరుకుంది. సెంచరీలు చేసినా కూడా ఈ ఇద్దరు వాటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే సెంచరీ చేసిన రిషబ్ పంత్ మాత్రం 118 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో… కరుణ్ నాయర్ బ్యాటింగ్ కు వచ్చాడు.
ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ( Test Match) ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ అలాగే గిల్ అద్భుతమైన సెంచరీలు నమోదు చేశారు. అటు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో… 100 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులకు అలవాటు అయింది. ఓలీ పోప్ 106 పరుగులతో రెచ్చిపోగా… హరీ బ్రూక్ 99 పరుగులు చేసి రాణించాడు. ఇక ఇప్పుడు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో కూడా 313 పరుగుల లీడ్ సంపాదించింది. ఈ మ్యాచ్ లో రేపు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది.
Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?
The pant way 🗿 pic.twitter.com/z9J1gNJsUb
— Out Of Context Cricket (@GemsOfCricket) June 23, 2025