Big Stories

Kashmir’s Kathua Encounter : ఎరుపెక్కుతోన్న కాశ్మీరం.. కారణాలేంటి ?

Kashmir’s Kathua Encounter : కశ్మీర్‌లోయ మళ్లీ ఎరుపెక్కుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉందనుకున్న లోయ.. ఇప్పుడు మళ్లీ రక్తమోడుతుంది. గన్స్‌ గర్జిస్తున్నాయి. మళ్లీ ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అసలు ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇలా రెచ్చిపోవడానికి కారణాలేంటి ? ఈ వరుస ఘటనలతో ఉగ్రవాదులు ఇస్తున్న సందేశమేంటి ?

- Advertisement -

కశ్మీర్.. చాలా నెలలుగా.. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడి వారంతా నార్మల్‌ లైఫ్‌ లీడ్ చేస్తున్నారు. అన్ని పర్‌ఫెక్ట్‌గా జరుగుతున్నాయి. కశ్మీర్ టూరిజం కూడా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో.. అక్కడ కూడా అలానే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే కశ్మీర్ వ్యాలీలో నిర్వహించిన ఎన్నికల్లో 51 పర్సెంట్‌ పోలింగ్ నమోదైంది. కానీ ఇంతలో అలజడి మొదలైంది. రైసీ, కథువా, దోడా.. ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల్లో మూడు ఉగ్రఘటనలు జరిగాయి. ఇప్పుడిదే మళ్లీ దేశం మొత్తం కశ్మీర్‌వైపు చూసేలా చేసింది. కశ్మీర్‌లో మళ్లీ ఏదో జరుగుతుంది..? అనే అనుమానాలను రేకెత్తేలా చేస్తుంది.

- Advertisement -

ఫస్ట్‌ అటాక్‌.. జూన్‌ 9న రైసీ డిస్ట్రిక్‌లో జరిగింది. ఓ టెంపుల్‌కి వెళ్లి వస్తున్న టూరిస్ట్‌ బస్‌ను ఉగ్రవాదులు వెంబడించారు. ముందుగా డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.. ఆ తర్వాత బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సెకండ్ అటాక్.. కథువా డిస్ట్రిక్‌లో.. ఇండియా, పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ బార్డర్‌కి సమీపంలోని హీరానగర్ సెక్టార్‌లోని ఉన్న సైదా గ్రామంలోని ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ ఇంటి ఓనర్.. గాయాలతో బయటపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్.. ఆ ప్రాంతానికి చేరుకొని ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. అయితే మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ అటాక్ చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. సో.. మరో ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు.

Also Read : కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

థర్డ్ అటాక్.. డోడా డిస్ట్రిక్‌లో.. ఈ జిల్లాలో ఇండియన్ ఆర్మీ ఓ టెంపరరీ ఆపరేటింగ్ బేస్‌ను ఏర్పాటు చేసింది. దీనినే టార్గెట్‌ చేసుకున్నారు ఉగ్రవాదులు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన ఈ దాడిలో ఓ స్పెషల్ ఫోర్స్‌ కమాండోతో పాటు మరో ఐదుగురు సోల్జర్స్‌కు గాయాలయ్యాయి. కౌంటర్‌ ఫైర్‌లో ఓ ఉగ్రవాదిని సైతం మట్టుపెట్టాయి భద్రతాబలగాలు.

ఈ మూడు ఘటనలు ఇప్పటి వరకు జరిగాయి. వీటిని చేసింది తామే అని గర్వంగా ప్రకటించుకుంది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబాకు చెందిన అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్. ఇదే గ్రూప్‌ మే 4న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై దాడి జరిపింది. సో.. ఈ దాడులతో ఇంకా మేమున్నామని.. మీరు అనుకున్నవి అనుకన్నట్టు చేయలేరని చెబుతున్నారు.

మూడు రోజుల్లో మూడు ఉగ్రదాడులు.. ఇందులో తొమ్మిది మంది సివిలియన్స్ మృతి చెందారు. ఓ ఆర్మీ పర్సనల్ అమరుడయ్యాడు. సో భద్రతా బలగాలు ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అండ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ రంగంలోకి దిగాయి. రైసీ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల అదుపులో 20 మందికి పైగా అనుమానితులు అదుపులో ఉన్నారు. మరికొంత మంది అనుమానితుల స్కెచ్‌ను రిలీజ్ చేశారు. ఓ వైపు ఉగ్రవాదులు పారిపోయారని అనుమానిస్తున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు వేటను మొదలుపెట్టాయి. ఇప్పటికే ఓ ఉగ్రవాదిని కూడా మట్టుపెట్టాయి. అయితే దురదృష్టవశాత్తు ఓ జవాన్‌ కూడా అమరుడయ్యాడు. బట్.. హంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది.

ఇది జరిగింది.. జరుగుతోంది. బట్ ఎందుకు జరుగుతుందో ఓ సారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్.. జమ్ముకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఉంటే దాయాది దేశానికి నచ్చదు. అక్కడ అశాంతి ఉంటేనే మాకు మంచిది అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. అందుకే బార్డర్‌ నుంచి మళ్లీ చొరబాట్లకు తెర లేపింది పాక్‌ ఆర్మీ.. ఈ విషయాన్ని ఇప్పటికే కశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా కన్ఫామ్ చేశారు.

Also Read : జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది?

సెకండ్.. ఇటీవల ఇండియా Pak Occupied Kashmirని తిరిగి స్వాధీనం చేసుకుంటామని బహిరంగంగానే చెబుతోంది. అక్కడ కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయి. పాక్ ఆర్థిక పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారిపోతుంది. ఇది భారత్‌కు అనుకూలించే విధానం.. దీనికి తోడు కేంద్రంలో మళ్లీ మోడీ సర్కార్‌కే మళ్లీ అధికారం చేతికి వచ్చింది. ఇది కూడా పాక్‌కు అస్సలు మింగుడుపడని అంశం.. దీంతో భారత్‌ POKపై ఫోకస్ చేయకుండా ఉండాలంటే.. అటెన్షన్‌ మొత్తం భారత్‌లోని కశ్మీర్‌పై ఫోకస్ అయ్యేలా చేయాలి. అలా జరగాలంటే కశ్మీర్‌లో మళ్లీ రక్తాన్ని పారించాలి.

థర్డ్.. స్థానిక ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాలి. కొన్ని రోజులుగా కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా జీవితాలను లీడ్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఇండియన్ ఆర్మీ నిఘా కూడా ఎక్కువగా ఉండటం లేదు. విచారణలకు పిలిచి ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. రాళ్ల దాడులు లేవు.. ఇండియన్‌ ఆర్మీ మీద కూడా వ్యతిరేకత చాలా వరకు తగ్గిపోయింది. ఇదంతా జరగాలంటే ఆర్మీ ఫోకస్ మళ్లీ కశ్మీర్‌ ప్రజలపై ఫోకస్ అయ్యేలా చేయాలి. అందుకే సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు తమ దాడుల్లో లోకల్ ప్రజలను ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. ఇది ఎలాగైనా విచారణలో తేలుతుంది. విచారణ పేరుతో పిలుస్తారు.దీన్ని తమకు అనుకూలంగా మలుచుకొని.. స్థానికంగా ఉద్యమాలు చేపట్టాలన్నది మరో స్కెచ్.

ఫోర్త్.. ఇది చాలా ఇంపార్టెంట్. జమ్ము కశ్మీర్‌లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు షురూ చేసేసింది. ఈ మంత్‌లోనే షెడ్యూల్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ఎలక్షన్స్ పూర్తి చేయాలని చూస్తుంది. రీసెంట్ ఎలక్షన్స్‌లో ఏకంగా 51 పర్సెంట్ పోలింగ్ నమోదైంది. అంటే అక్కడి ప్రజలు ఓట్లు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్కసారి కశ్మీర్‌లో కనుక ఎలక్షన్స్‌ పీస్‌ఫుల్‌గా జరిగితే.. అది ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసెజ్ ఇచ్చినట్టవుతుంది. ఇది కూడా ఉగ్రవాదులకు అస్సలు మింగుడు పడని అంశం.

సో.. కశ్మీర్‌ ప్రశాంతంగా ఉంటే ఉగ్రవాదుల అస్థిత్వానికే ప్రమాదం.. అందుకే మళ్లీ అలజడి మొదలుపెట్టారు. కానీ అటు కేంద్రానికి.. ఇటు ఇండియన్ ఆర్మీకి ఈ ఇష్యూస్‌ను ఎలా డీల్ చేయాలో తెలుసు. గతంలో ఎన్నింటినో చూశారు.. ఇప్పుడు కూడా ఉగ్రవాదుల హంట్‌ కొనసాగుతోంది. త్వరలోనే ఏరివేస్తారు.. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎట్ ది సేమ్‌ టైమ్.. ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో.. అక్కడ కూడా కత్తిరింపులు ఉంటాయి. బట్ కొంచెం టైమ్ పడుతుంది అంతే. అయితే ఈలోపు ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News