E-Paper
Advertisement

మార్కెట్‌లో.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త ఇయర్ బడ్స్, ఫీచర్లు మామూలుగా లేవు

మార్కెట్‌లో.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త ఇయర్ బడ్స్, ఫీచర్లు మామూలుగా లేవు
Advertisement

Truke Mega 7 TWS earbuds: తక్కువ బడ్జెట్‌లో సినిమా థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారా? మీకోసమే మార్కెట్లోకి వచ్చేసింది ‘ట్రూక్ మెగా 7’ (Truke Mega 7) ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్. కేవలం రూ.999 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్, అద్భుతమైన 24-బిట్ స్పేషియల్ ఆడియో టెక్నాలజీతో వస్తున్నాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్ ,స్టైలిష్ లెదర్ ఫినిష్ డిజైన్‌తో ప్రస్తుతం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లేటెస్ట్ గార్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ట్రూక్ మెగా 7 ఫీచర్లు:

1.డిజైన్ ప్రత్యేకతలు:
ప్రస్తుత ట్రెండ్‌లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. అందుకే సామాన్యులకు సైతం ప్రీమియం ఫీల్ పంచేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్ ట్రూక్ తన కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.. అదే ‘ట్రూక్ మెగా 7’. ఈ ఇయర్ బడ్స్ చూడటానికి.. అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. ప్రీమియం లెదర్ ఫినిష్‌ కేస్‌తో వస్తాయి. చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉండి, చూడటానికి రాయల్ లుక్‌ను ఇస్తాయి.

Advertisement

2.సౌండ్ క్వాలిటీ, 24-బిట్ స్పేషియల్ ఆడియో:

ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ హైలైట్ వీటిలోని ఆడియో పర్ఫార్మెన్స్. ఇందులో శక్తివంతమైన 13mm టైటానియం డ్రైవర్లను వాడారు. దీనికి తోడు 24-బిట్ 360 డిగ్రీల స్పేషియల్ సౌండ్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు లేదా సినిమాలు చూస్తున్నప్పుడు శబ్దం నలుమూలల నుంచి స్పష్టంగా వినిపించి, ఒక థియేటర్ ఫీల్ కలుగుతుంది. డీప్ బేస్ , క్రిస్టల్ క్లియర్ హైస్ దీని సొంతం.

Advertisement

3. బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్:

ప్రయాణాలు చేసే వారికి బ్యాటరీ టెన్షన్ లేకుండా.. ఉండేలా ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తం 60 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా.. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

4.గేమింగ్, కాలింగ్ ఫీచర్లు:

గేమ్‌లు ఆడేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా అల్ట్రా-లో లాటెన్సీ మోడ్ ఇవ్వబడింది. దీని వల్ల గేమింగ్ సమయంలో ఆడియో, వీడియో మధ్య ఎలాంటి జాగ్ లేదా డిలే ఉండదు. అలాగే, ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎదుటివారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేందుకు క్వాడ్-మిక్ ENC టెక్నాలజీ సహకరిస్తుంది. రద్దీగా ఉండే.. ప్రదేశాల్లో కూడా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

Also Read: తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే

5. ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ ట్రూక్ మెగా 7 ఇయర్ బడ్స్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఆఫర్ కింద కేవలం రూ. 999 ధరకే అందుబాటులో ఉన్నాయి. కోల్ బ్లాక్ , కాఫీ బ్రౌన్ వంటి కలర్ ఆప్షన్లలో ఇవి లభిస్తున్నాయి.

రూ. 1,000 బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ట్రూక్ మెగా 7 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ హంగులు కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

Related News

నూనె వాడకం తగ్గించాలా? రూ.2,999కే ఈ అద్భుతమైన ఎయిర్ ఫ్రైయర్!

ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. ఒకేసారి 4 చౌకైన ప్లాన్లు తొలగింపు.. ఇక మీ జేబుకు చిల్లే!

ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్.. రెండింట్లో ఏది బెస్ట్.. దేనివల్ల డబ్బులు మిగులుతాయి!

యాపిల్ లవర్స్‌కు షాక్.. iPhone 18 Proతో పాటు పాత ఫోన్ల ధరలూ పెరుగుతున్నాయా?

కాలేజీ స్టూడెంట్స్, లేడీస్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్‌వాచ్.. బడ్జెట్లోనే !

ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!

తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే

Big Stories

Advertisement
×