E-Paper
Advertisement

కలిసొచ్చిన లక్కీ భాస్కర్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీకి భారీ బిజినెస్!

కలిసొచ్చిన లక్కీ భాస్కర్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీకి భారీ బిజినెస్!
Advertisement

Vishwanath and sons: విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya )!తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ప్రముఖ బ్యూటీ మమిత బైజు (Mamitha baiju) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky atluri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ (Naga Vamsi) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గతంలో ఇదే డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాంబినేషన్లో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అదే డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాంబినేషన్లో రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ పై పాజిటివిటీ భారీగా పెరిగిపోయింది..

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్..

పైగా ఈ లక్కీ భాస్కర్ సక్సెస్ కారణంగా విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి బిజినెస్ భారీగా జరగడం గమనార్హం. రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం హక్కులు సుమారుగా రూ.90 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులు రూ.125 కోట్ల మేరా ధర పలకడం గమనార్హం. అంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.125 కోట్లు లభించాయి. అందులోరూ.85 కోట్లు డిజిటల్ రైట్స్ తో రాగా , ఆడియో హక్కుల కోసం రూ.12 కోట్లు, అన్ని భాషలు కలుపుకొని శాటిలైట్ హక్కులు కలిపి రూ.28 కోట్లు పలికాయని అంటున్నారు.మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే ఏకంగా రూ.215 కోట్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. ఏది ఏమైనా ఈ బిజినెస్ లెక్కలతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదల కాకముందే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు రూ.85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లు తెలుస్తోంది.

Advertisement

also read:రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!

విజయ పరంపర కొనసాగిస్తున్న నాగ వంశీ..

ఈ ఏడాది టాలీవుడ్ లో వరుస విజయాలతో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఇదే బ్యానర్ పై అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరి నిర్మాత నాగ వంశీకి భారీ లాభాలను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా విడుదలకు ముందే భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఏది ఏమైనా ఈ కమర్షియల్ బిజినెస్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ మరో ల్యాండ్ మార్క్ మూవీ గా నిలవనుంది అని చెప్పవచ్చు.

జన నాయగన్ రికార్డ్ బద్దలు..

Advertisement

విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సరికొత్త రికార్డు సృష్టించి, విజయ్ జననాయగన్ రికార్డు బద్దలు కొట్టింది. జననాయగన్ 1.72 కోట్ల ఓపెనింగ్ డే ప్రీ సేల్స్ రికార్డును అధిగమించింది. ముఖ్యంగా తెలుగు వర్షన్ 1.82కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగని ‘ డ్రాగన్’ మూవీ షూటింగ్!

రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!

బ్రేకప్ పై స్పందించిన అనుపమ.. ఇంకొన్నాళ్లు రిలేషన్షిప్ లో ఉండుంటే చనిపోయేదాన్ని!

యశ్, రాధికా లవ్ స్టోరీలో ఇదే స్పెషల్ మూమెంట్.. వీడియో వైరల్!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశేనా? ‘ఫౌజీ’ విషయంలో ట్విస్ట్!

థియేటర్‌లో చూసిన హీరో పక్కనే.. ఇప్పుడు హీరోయిన్‌గా!..ఇరుముడి ఈవెంట్లో ప్రియా భవాని శంకర్!

చదువులో ఫెయిల్.. సినిమాల్లో మాత్రం సక్సెస్.. ‘ఇరుముడి’ ఈవెంట్‌లో రవితేజ ఆసక్తికర కామెంట్స్!

Big Stories

Advertisement
×