CM Chandrababu Sensational Comments on Tirupati Laddu: తిరుమలలోని శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో నాణ్యత లేని పదార్థాలతో లడ్డూలు తయారు చేశారంటూ మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీశారన్నారు. జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఇటు అన్నదానంలోనూ నాణ్యలే లేకుండా చేశారన్నారు. దేవుడు దగ్గర పెట్టే ప్రసాదలను అపవిత్రం చేశారంటూ సీఎం తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
Also Read: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
బుధవారం మంగళగిరిలో కూటమి ప్రభుత్వ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం పట్టించింది. ప్రభుత్వ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసింది. అటు కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా పక్కదారి పట్టించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. వీటితోపాటు రూ. లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
మేం అధికారంలోకి వచ్చిన తరువాత షాక్ కు గురయ్యాను. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ఖజానాలో ఎక్కడా కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో అధికారులకు జీతాలు కూడా ఇవ్వలేని స్విచుయేషన్ లో ప్రభుత్వం ఉంది. అయినా కూడా మేం ధైర్యంగా ముందుకువెళ్తున్నాం. ప్రస్తుతం వెంటిలెటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరం. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే దిశగా ముందుకువెళ్తున్నాం.
Also Read: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్
ఎప్పుడూ కూడా విర్రవీగొద్దు. గత సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా విర్రవీగాడు. 151 సీట్లు ఉన్నాయంటూ విర్రవీగిన ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయనను కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.