Pavan Kalyan Serious on Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పనిచేశాం. చంద్రబాబు అనుభవాన్ని దగ్గరనుంచి చూశా. ఎన్నికల్లో అద్భత విజయాన్నిసాధించాం. నేతల సమిష్టి కృషితోనే ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని అవమానాలు ఎదురైనా చంద్రబాబు అధైర్యపడలేదు. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి.. ధైర్యంగా ఉండాలన్నారు. చంద్రబాబు దార్శనికత ఏపీకి ఎంతో అవసరం. చంద్రబాబుకు మద్దతు ఇస్తే నన్ను ఇబ్బందిపెట్టారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..
6 నెలల్లో ప్రభుత్వం మారబోతుందని అధికారులకు చెప్పాను. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. హామీలో ఇచ్చినట్టుగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఇచ్చాం. పెన్షన్ పెంచేందుకు ఖజానాలో డబ్బు లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్లు పెంచాం. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను జగన్ మూసివేశాడు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలకు మంచి జరుగుతుంది. అధికారంలోకి రాగానే ల్యాంటి టైటిల్ యాక్ట్ ను రద్దు చేశాం.
గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోని బకాయిలను చెల్లించాం. గత ప్రభుత్వం పంచాయతీల్లో నిధులు లేకుండా చేసి వెళ్లిపోయింది. స్థానిక సంస్థలకు రూ. 100 కోట్లకు పైగా నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో వరదలొస్తే వైసీపీకి బాధ్యత లేదా? ఈ వయసులోనూ చంద్రబాబు పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అధినేత ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించారు. చంద్రబాబకు మేమంతా అండగా ఉన్నాం’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
Also Read: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్