Free Gas Cylinders to provide from Diwali Festival: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ నుంచి రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీపావలి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీపావలి రోజు ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా మొత్తం 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తామంటూ చంద్రబాబు వెల్లడించారు.
Also Read: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్
ఇదిలా ఉంటే.. రాష్ట్ర కేబినెట్ బుధవారం సమావేశమయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సగటు మద్యం ధర రూ. 99 నుంచి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
ప్రజారోగ్యానికి సంబంధించిన ‘స్టెమీ’ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ మాదిరిగా విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇటు పోలవరం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టును సీడబ్య్లూసీ సూచనల మేరకే పాత ఏజెన్సీకి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హోంశాఖలో కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
Also Read: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్