BigTV English

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Comedian Ali:  కమెడియన్ ఆలీ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా మారుతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కనిపించి విమర్శలు అందుకున్న ఆలీ.. సండే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో  హీరోగా చేస్తున్నాడు.  తాజాగా   ఉత్సవం సినిమాలో ఆలీ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.


దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో తాజాగా చిత్ర బృందం  సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొంది.  ఈ ఈవెంట్ లో ఆలీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నారదుడు అనే పాత్రలో కనిపించాను అని, అది తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపాడు.

ఇక స్పీచ్ అనంతరం.. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఆలీ సమాధానమిచ్చాడు. ఇందులో భాగంగానే  ఆలీకి, పవన్ కళ్యాణ్ గురించిన ప్రశ్న ఎదురైంది. పవన్ – ఆలీ స్నేహ  బంధం గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఒకానొక సమయంలో ఆలీ లేని పవన్ సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు.. రాజకీయాల వలన విడిపోయారు. పవన్ జనసేన  పార్టీ స్థాపించిన్నప్పుడు .. ఒక ఫ్రెండ్ గా ఆలీ, పవన్ కు అండగా నిలబడలేదు. తనకు ఇష్టమైన వైసీపీలోనే కొనసాగాడు.


Kumari Aunty: కుమారి ఆంటీ గొప్ప మనసు.. సీఎం కు రూ. 50 వేలు చెక్కు అందజేత

ఇక ఇద్దరు ఒకపక్క ఫ్రెండ్స్ గా ఉంటూ.. రాజకీయాల్లో ఉండలేమని పవన్ భావించి, ఆలీని దూరం పెట్టిన్నట్లు సమాచారం. అలా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయారు. కానీ, ఏరోజు కూడా  ఆలీ.. రాజకీయ స్పీచ్ లలో కానీ, మీడియా ముందు కానీ, పవన్ ను తక్కువ చేసి మాట్లాడలేదు.. విమర్శించలేదు.

ఇక ఈ ఈవెంట్ లో కూడా ఒక రిపోర్టర్ .. పవన్ తో మీ అనుబంధం ఎలా ఉంది అని అడగ్గా.. ” మా ఇద్దరి మధ్య అనుబంధం.. మూడు పువ్వులు ఆరుకాయలులానే  ఉంది. పవన్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను” అని చెప్పుకొచ్చాడు.  ఇక ఈ మధ్యనే ఆలీ.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన విషయం  తెల్సిందే.  మరి ఇప్పుడు ఆలీని, పవన్ దగ్గరకు రానిస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి. 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×