CM Chandrababu: సీఎం చంద్రబాబు రూటు మార్చారా? కార్యకర్తలే పార్టీకి కొండంత అండని భావిస్తున్నారా? ఈ విషయాలను పదే పదే చెబుతున్నారు. పార్టీ సమావేశాల్లో ఈ మధ్యకాలంలో తరచు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో కార్యకర్తలు నరకం అనుభవించారు. అవన్నీ గమనించిన అధినేత, ఎప్పుటికప్పుడు వారితో టచ్‌లో ఉంటున్నారు. వారి గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే వారిలో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
సీఎం చంద్రబాబు.. పార్టీ కార్యకర్త పట్ల మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న పార్టీ అభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఆ కార్యకర్త చివరి కోరికను నెరవేర్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మోరంపూడి ప్రాంతానికి చెందినవాడు ఆకుల కృష్ణ. చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని.
ముఖ్యంగా చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. స్థానికంగా లోకల్‌గా చంద్రబాబును ఎవరు విమర్శించినా ధీటుగా సమాధానం ఇచ్చేవాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు కృష్ణ. తన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో మనసులోని మాటను కుటుంబసభ్యులకు చెప్పాడు. జీవితంలో ఒక్కసారైనా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలనే కోరికను బయటపెట్టాడు.
ఈ విషయం కో-ఆర్డినేటర్ల ద్వారా జిల్లా అధ్యక్షుడికి, అక్కడి నుంచి అధినేత చంద్రబాబు చెవిలో పడింది. వెంటనే స్పందించారు సీఎం చంద్రబాబు. కార్యకర్త ఆకుల కృష్ణతో వీడియో కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.
ALSO READ: దువ్వాడకు వైసీపీ ఝలక్.. టెక్కలి నుంచి బరిలోకి వాణి?
ఈసందర్భంగా కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేయడంతో ఆకుల కృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. ఇప్పుడు తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ జీవితానికి అది చాలని అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీరిక లేకుండా గడిపేవారు సీఎం చంద్రబాబు. నిత్యం పనిలో తనమునకలైపోయేవారు. ఈసారి వారానికి ఒకసారి పార్టీ ఆఫీసుకి వెళ్లడం, అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు.
కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్..!
క్యాన్సర్‌తో బాధ పడుతున్న టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ
చంద్రబాబుతో మాట్లాడాలనేది కృష్ణ చిరకాల కోరిక
విషయం తెలుసుకుని స్వయంగా వీడియో కాల్ చేసిన సీఎం
కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
అన్ని విధాలా అండగా ఉంటానని కుటుంబానికి… pic.twitter.com/fQdRBY0sPB
— BIG TV Breaking News (@bigtvtelugu) July 6, 2025