Karimnagar Crime: జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన హితిక్ష(5).. దారుణంగా హత్యచేశారు. చిన్నారి జూలై 4న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. తీరా చూసాక అదే కాలనీలోని జూలై 5న ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో కనిపించింది. చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కొండా వివాదం.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. చిన్నారి మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికను అదే ప్రాంతానికి చెందిన సైకో విజయ్ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సైకో చంపేశాడా? లేక ఎవరైన చంపేశారా? అసలు ఎందుకు ఆ చిన్నారిని చంపాల్సి వచ్చింది అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.