BigTV English

CM Jagan Comments : జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan Comments : జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
cm jagan comments

CM Jagan Comments(AP politics):

ఏపీలో రాజకీయం రోజుకో రంగు మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో జాతీయ పార్టీలకు చోటు లేదాని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీజేపీ – బీఆర్ఎస్ ఒకటే అంటూ జరిగిన ప్రచారంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలకు గట్టి దెబ్బే తగిలింది. ఆ ఎఫెక్ట్ తోనే ఇప్పుడు సీఎం జగన్ సైతం రూట్ మార్చి బీజేపీపై విమర్శలు గుప్పించారని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు గానే బీజేపీ సైతం జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు వ్యహలు రచిస్తుందని సమాచారం అందుతుంది.


తిరుపతి ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేనతోనే తమకు పోటీ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందని.. కుటుంబాన్ని చీల్చే కుట్రలు చేస్తుందని విమర్శించారు. గతంలో తన బాబాయ్‌ను.. ఇప్పుడు తన సోదరిని తనపై పోటీకి దింపిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో సఖ్యతగా ఉన్నామని తెలిపారు. సర్వేల ఆధారంగానే ఇంఛార్జులను మార్చామని.. ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే కొందరి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ప్రజలు మావైపే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు.

అలానే రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమేనన్నారు సీఎం జగన్. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదని.. దాంతో తెలుగుదేశం, జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే వైసీపీకి పోటీ ఉంటుందన్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే జగన్ బీజేపీని సైతం పక్కన పెడుతున్నారని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఏపీలో త్వరలోనే అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ జాతీయ పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.


టీడీపీ, జనసేన లపైనే ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు సీఎం జగన్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. రాష్ట్ర అభివృద్ది కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పై పరోక్షంగా నిరసన గళం లేవనెత్తడం పట్ల పలువురు బీజేపీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. ప్రత్యేక హోదా, పలు ప్రాజెక్టుల విషయంలో వైసీపీ వైఫ్యల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇప్పుడు బీజేపీకి రివర్స్ అవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు బీజేపీ నేతలు కూడా వైసీపీ సర్కారుపై మాటల తూటాలు పేల్చుతున్నారు. గత నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి తప్ప మరేం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర పథకాలను సైతం సీఎం జగన్ తన ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్న బీజేపీ.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×