BigTV English

CM Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపిక పూర్తి.. మంగళగిరి సభలో సీఎం జగన్..

CM Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపిక పూర్తి.. మంగళగిరి సభలో సీఎం జగన్..
Advertisement

CM Jagan Mohan Reddy speech


CM Jagan Mohan Reddy speech(Political news in AP): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్తుల ఎంపిక పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకొని పార్టీ క్యాడర్ పని చేయాలని సూచించారు.

శాసన సభ, లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లేనని సీఎం జగన్ అన్నారు. చాలా స్వల్ప మార్పులు ఉంటే ఉండవచ్చన్నారు.మార్చాల్సినవి ఇప్పటికే 99 శాతం మార్చామని పేర్కొన్నారు. ఇక పెద్ద మార్పులేవీ ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబానికి ఐదారు సార్లు కాలవాలని ఆయన సూచించారు.


Read More:  క్రికెట్‌లో రాజకీయం.. విహారికి మద్దతుగా అశ్విన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టీవ్ గా ఉండాలని సీఎం జగన్ అన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. ఇంచార్జీ బాధ్యతలు చేపట్టినవారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.

Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×