BigTV English

CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : విశ్వసనీయత, విలువలు గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ .. విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని. తమ పార్టీలోకి రావాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తర్వాత అయిదుగురు విపక్ష ఎమ్మెల్యేలు తనకు జై కొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు.. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెప్తున్నారన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అసలింత సడన్‌గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక సీఎం లెక్కలేంటన్న చర్చ మొదలైంది.

CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : విశ్వసనీయత, విలువలు గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ .. విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని. తమ పార్టీలోకి రావాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తర్వాత అయిదుగురు విపక్ష ఎమ్మెల్యేలు తనకు జై కొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు.. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెప్తున్నారన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అసలింత సడన్‌గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక సీఎం లెక్కలేంటన్న చర్చ మొదలైంది.


పొలిటికల్ ఎథిక్స్.. అదేనండి రాజకీయ విలువల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినంతగా ఎవరూ మాట్లాడి ఉండరు. మాట్లాడరు కూడా.. అలా విలువలతో కూడిన రాజకీయం చేస్తామంటూ నిత్యం వల్లె వేసే జగన్‌.. ఆ విలువలకే కొత్త బాష్యం చెప్తున్నట్లు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతో విభేదించిన నలుగురు సొంత ఎమ్మెల్యేలపై.. ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారాయన.. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.

వచ్చేనెల ఆఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఆ ఎన్నికల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం సబబే.. మరి తన పార్టీ జపం చేస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అదే నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్న చర్చ మొదలైంది. 2019లో టీడీపీ తరఫున గెలిచిన నలుగురు, జనసేన నుంచి గెలిచిన ఒకరు.. మొత్తం అయిదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు అధికారికంగా వైసీపీ ఇన్‌చార్జ్‌లుగా కూడా వ్యవహరిస్తున్నారు. వారిపై ఏ చర్యలూ చేపట్టలేదేం? ఇదేం విలువలతో కూడిన రాజకీయమో సీఎం జగనే చెప్పాలి మరి.


పార్టీతో విభేదించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి.. వారిపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ అధినాయకత్వానికి సంవత్సరం తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడో గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలూ వైసీపీతో విభేదించారు. ఇప్పుడు తీరిగ్గా ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు, వేరే పార్టీలో చేరారంటూ వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని కోరడం.. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే అంటున్నారు. వచ్చే నెల మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగానే ఈ నలుగురిపై వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు సిట్టింగులకు టికెట్లు లేకుండా చేస్తోంది వైసీపీ .. అలా తమ టికెట్లను ఎడాపెడా చించేస్తున్న జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే.. పీకల దాకా కోపంగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని గందరగోళంలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందంటున్నారు. తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలనూ బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.

పార్టీతో విభేదించారంటూ నలుగురు సొంత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన వైసీపీ .. ప్రతిపక్షాల నుంచి తన చెంతకు వచ్చిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వివాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, గుంటూరు పశ్చిమం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మద్దాలి గిరిధర్‌, చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం, జనసేన తరఫున నెగ్గిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైసీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. వారు వేరే పార్టీల ఉంచి వచ్చారని, వారిపైనా చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని జగన్ కన్‌వీనియెంట్‌గా మర్చిపోయారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులకు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లు మేరిగ మురళీధర్‌, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దాంతో వైసీపీవి విలువలు అనాలా? దిగుజారుడు రాజకీయం అనాలా? అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×