AP Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రవులు.. శాశ్వత మిత్రలు ఉండరు. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు ఎప్పుడు.. ఎప్పుడు.. ఏ పార్టీతో ఉంటాయో తెలీదు. పరిస్థితులకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఈ విషయంలో కాంగ్రెస్ నుంచి జగన్‌కు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. వాటిని జగన్ వినియోగించుకుంటారా? అన్నది అసలు ప్రశ్న.
ఏపీ రాజకీయాల్లో ‘వన్ షార్ట్ టూ బర్డ్స్’ ఫార్ములాని జగన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు. పార్టీ అధినేతగా జగన్ చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్‌ని టచ్ చేశారు జగన్.
ఏపీలో ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హాట్ లైన్ ద్వారా టచ్‌లో ఉన్నారంటూ కొత్త పాయింట్‌ని తెరపైకి తెచ్చారు. ఈ లెక్కన ఎన్డీయే నుంచి టీడీపీని బయటకు పంపేందుకు జగన్ ఆ తరహా ఎత్తుగడ వేశారా? కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ఆ విధంగా మాట్లాడారా? అనేదానిపై ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది.
రాహుల్‌గాంధీ మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కౌంటరిచ్చారు. జగన్‌కి దమ్ముంటే ఓట్ల చోరీ విషయంలో మోడీ-అమిత్ షాలకు వ్యతిరేకంగా ఏపీ పీసీసీ షర్మిల విజయవాడలో చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని సూచన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ వ్యాఖ్యలపై వెంటనే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది.
ALSO READ: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం
ఇప్పుడు కాకపోయినా ఎన్నికల నాటికి జగన్.. కాంగ్రెస్ వైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది కొందరి వైసీపీ నేతల మాట. అందుకే ఏపీలో ఓట్ల చోరీ అంటూ జగన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని అంటున్నారు. మరికొందరు జగన్ మాటలను తమకు అనుకూలంగా మరికొందరు మలచుకుంటున్నారు.
ఎన్డీయే నుంచి టీడీపీని బయటకు పంపించేలా వేసిన ఎత్తుగడలో భాగమని ఇంకొందరు వైసీపీ నేతల మాట. జగన్ విషయంలో 2018లో టీడీపీ ఓసారి తప్పు చేసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు. ఈసారి టీడీపీ అలాంటి అవకాశం ఇవ్వదని చెబుతున్నారు. పులివెందుల జెడ్సీటీసీ ఉప ఎన్నికల పుణ్యమాని తొలిసారి రాహుల్‌గాంధీ పేరుని జగన్ ప్రస్తావించారని అంటున్నారు.
ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో హస్తానికి ఫ్యాన్ దగ్గర కావడం ఖాయమనే వాదన మొదలైంది. ఇప్పుడు హస్తానికి అనుకూలంగా జగన్ మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం ముప్పు పొంచి ఉందని భావించి ఈ విధంగా మాట్లాడారని అంటున్నారు. వైసీపీ పాలన చూసిన తర్వాత జగన్ మాటలను ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వైపీసీకి జాతీయ పార్టీ నుంచి మద్దతు ఉంటే వచ్చే ఎన్నికల నాటికి కూటమికి గట్టి పోటీ ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషకుల మాట.
రాహుల్ గాంధీ పై జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కౌంటర్
జగన్ కి దమ్ముంటే ఓట్ల చోరి విషయంలో మోడీ ,అమిత్ షా కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏపీ పీసీసీ షర్మిల రేపు విజయవాడ లో చేపట్టే ర్యాలీలో పాల్గొనాలి
ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ… https://t.co/KN2bGXzSZM pic.twitter.com/NGUkx5oWVx
— ChotaNews App (@ChotaNewsApp) August 13, 2025