AI In Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి. శ్రీనివాసుడి నిజరూప దర్శనం ఒక్క క్షణమైనా చాలు అనుకుని పరితపిస్తుంటారు కోట్లాది మంది భక్తజనం. ఎన్ని గంటలైనా ఓపికతో ఉంటారు. ఎంత కష్టమైనా భరిస్తారు? ఎందుకంటే ఆయన ఆపద మొక్కులవాడు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అయితే తిరుమల ఆలయంలో భక్తుల దర్శన సమయాన్ని తగ్గించేందుకు, ఇతరత్రా భక్తుల సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా వచ్చిన ఆలోచన AIతో దర్శనాన్ని వేగంగా జరిపేలా చూడడం. అయితే దీని చుట్టూ వివాదాలు పెరుగుతున్నాయ్.. ఎందుకిలా?
వేగంగా దర్శనాలకు AI వాడాలని నిర్ణయం
రైట్ చూశారుగా.. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు పదే పదే వెళ్తున్నాయి. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. సో ఈ ఉదాహరణ ఎందుకంటే తిరుమల శ్రీనివాసుడి ఆలయానికి సంబంధించిన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన నిబంధనలు, ఆధ్యాత్మికత, భక్తుల మనోభావాలు.. ఇవన్నీ చాలా కీలకం. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం చేయించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని డిసైడ్ అయింది. టీటీడీ బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయం జరిగింది. దర్శనాల విషయంలో ఇదో కీలక ముందడుగు అని చెబుతున్నారు. గూగుల్, TCS వంటి టెక్ సంస్థలతో చర్చలు జరిపారు కూడా. భక్తులకు కేవలం ఒకటి లేదా రెండు గంటల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తుల గుర్తింపు, క్యూ మేనేజ్‌మెంట్, దర్శన సమయాలను ముందుగానే తెలిపే సిస్టమ్ ను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంస్కరణలపై చర్చ జరిగినప్పుడల్లా ఇష్యూ
రైట్.. టీటీడీ అనుకోవడం బాగుంది.. భక్తుల ఎదురుచూపుల్ని తగ్గించడం వరకు ఓకే. అయితే ఇక్కడే ట్విస్టులు కూడా ఉంటాయి. దైవ దర్శనం అన్నది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కల్పించే విషయం. యంత్ర పరికరాల వాడకం, టెక్నాలజీ వినియోగం.. ఇలాంటివి సంప్రదాయాలకు విరుద్ధం అన్న చర్చ కూడా ఒకటి తెరపైకి వస్తుంటుంది. కొండపై సంస్కరణలు ప్రతిపాదించిన ప్రతిసారీ సహజంగానే చర్చ జరుగుతుంది. ఏఐ దర్శనాలు అంటూ టీటీడీ అలా ఎలా చేస్తుంది.. కనీసం వేద పండితులను అడగక్కర్లేదా.., ఆగమ శాస్త్రాలను స్టడీ చేయనవసరం లేదా అన్న పాయింట్లు తెరపైకి వస్తున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయడం వరకు ఓకే.. కానీ.. ఆగమ శాస్త్రాలకు, సంప్రదాయాలకు ముడిపడి ఉన్న విషయాలలో ఏది పడితే అది చేయడం కరెక్ట్ కాదన్నది టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం చెబుతున్న మాట. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేయాలని చూసినా అవన్నీ ఆలయంలోని నిర్మాణాత్మక పరిమితులు ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం విఫలమయ్యాయంటున్నారు. ఏఐతో ఒకటి రెండు గంటల్లో దర్శనం కల్పించడం అసాధ్యం అన్నారాయన. తిరుమల కొండపై సంప్రదాయాలను గౌరవిస్తూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం సవాళ్లతో కూడుకున్నదే.
భక్తులకు రిలీఫ్ కలిగించడమే లక్ష్యమన్న నాయుడు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అయినా.. ఇంకోటైనా.. ఇలాంటి విధానాలకు గుడ్ బై చెప్పి.. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచనలు చేశారు ఎల్వీ సుబ్రమణ్యం. ఆయన అలా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో భక్తులకు సౌకర్యాల విషయంలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్ని పాస్ అయ్యాయి. ఇంకొన్ని ఫెయిల్ అయ్యాయి. అందుకే ఈ చిక్కులన్నీ. ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే రియాక్ట్ అయ్యారు కూడా. టీటీడీలో గతంలో ఈఓగా పని చేసిన అనుభవం ఉండి కూడా ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమన్నారు. శ్రీవారిని క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నుంచి బయటపడేసే ఉద్దేశంతోనే ఏఐ టెక్నాలజీ విధానంతో వేగంగా దర్శనం చేయించాలనుకుంటున్నామన్నారు. భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, తిరుమలలో ఏఐ టెక్నాలజీ వేస్ట్ అని చెప్పడం కరెక్టేనా అని క్వశ్చన్ చేశారు.
మూడో క్యూకాంప్లెక్స్ ఎందుకన్న భూమన
ఇంకోవైుపు తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఏఐతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటున్న చైర్మన్.. మరి శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్ లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్‌కు పాలకమండలిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నారు. గూగుల్, టీసీఎస్ ప్రతినిధులకు కొండపైన గెస్ట్‌హౌస్‌లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించడం ఏంటంటున్నారు. గత 9 నెలలుగా ఏఐ టెక్నాలజీ అంటూ పదవీ కాలం ముగిసే వరకూ ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని భూమన ఫైర్ అవుతున్న పరిస్థితి. TTD ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పరీక్షిస్తోంది. దీని ద్వారా డూప్లికేట్ బుకింగ్‌లను అడ్డుకుని ఎక్కువ మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా చూస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఆలయంలోని పవిత్ర వాతావరణాన్ని కాపాడుతూనే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద సవాలే.
AI ప్రతిపాదనపై మిశ్రమ స్పందన
తిరుమలలో AI దర్శన వ్యవస్థ పెద్ద మార్పును తీసుకొస్తుందా లేక సంప్రదాయ వాదనతో ఆగిపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో భౌతికంగా మార్పులు చేయకుండా కేవలం టెక్నాలజీ వాడి సౌకర్యాలు కల్పిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మరి నెక్ట్స్ ఏం జరగబోతోంది? తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో మార్పులు జరగాలంటే అది ఓ పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఆ తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కూడా AI విషయంలో అదే జరుగుతోంది. TTD ఉద్యోగులలో కొందరు ఈ AI ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. గంటల తరబడి క్యూలలో నిలబడే భక్తుల బాధను తగ్గించడానికి ఇది ఒక గొప్ప అవకాశమంటున్నారు. AI విఫలమైనా, కనీసం కొత్త పద్ధతుల ద్వారానైనా దర్శన సమయాన్ని తగ్గించే అవకాశం ఉందంటున్నారు.
తిరుమలలో వైఖానస ఆగమశాస్త్రం ఫాలో
తిరుమలలో భక్తుల సౌకర్యాలంటూ కొన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చి ఫెయిల్ అయినవేంటో ఓసారి చూద్దాం. భక్తులను వేగంగా దర్శనం వైపు తీసుకెళ్లేందుకు మూవింగ్ కార్పెట్ అంటే కన్వేయర్ బెల్ట్ లాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన వచ్చింది. ఈ ఆలోచన ఉద్దేశం దర్శన సమయాన్ని తగ్గించడం. అయితే ఆలయం నిర్మాణం ప్రకారం కొత్త వ్యవస్థ ఏర్పాటు మార్పులు చేర్పులకు వీలు లేకుండా పోయింది. ఆగమ శాస్త్ర నియమాలకు తగ్గట్లు ఇలాంటి యాంత్రిక వ్యవస్థలు ఆలయ పవిత్రతకు భంగం అన్న ఆందోళన పెరిగింది. ఆగమ శాస్త్రం అన్నది హిందూ ఆలయ పూజలు, ఆచారాలు, నిర్మాణ నియమాలను నిర్దేశించే శాస్త్రం. తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రం ఫాలో అవుతారు. దీన్ని వేదాలతో సమానంగా చూస్తారు. దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఆగమ శాస్త్రానికి ఓ లెక్క ఉంది. ఆలయంలో దైవిక వాతావరణాన్ని కాపాడటం ఆగమ శాస్త్రం ప్రధాన లక్ష్యం. దర్శనం అన్నది కేవలం దేవుడిని చూడటమే కాదు. ఆధ్యాత్మిక అనుభవం. మెషినరీ వ్యవస్థలు లేదా అతిగా టెక్నాలజీ వాడడం ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆగమ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!
ఒక ఇటుక మార్చాలన్నా కఠిన నియమాలు
ఆగమ శాస్త్రం ఆలయ నిర్మాణం, విగ్రహ స్థాపన, పూజా విధానాల గురించి కఠినమైన నియమాలను చెబుతుంది. ఈ శాస్త్రం భక్తుల దర్శన సౌకర్యాల గురించి ప్రత్యక్షంగా చెప్పదు, కానీ పూజా విధానాలు, ఆచారాలు, ఆలయ నిర్వహణ గురించి చెబుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో ఒక ఇటుకను కూడా అటు ఇటు మార్చడానికి కఠిన నియమాలు ఉన్నాయి. సో దీని ప్రకారం సాంకేతికత…., ఆచారాలకు ఆటంకం కలిగించొద్దన్న పాయింట్ ను కొందరు వినిపిస్తున్నారు. సో ఇలాంటి నియమాలు టెక్నికల్ ఎక్విప్ మెంట్ పెట్టేందుకు అడ్డంకులుగా మారుతున్నాయంటున్నారు. TTD ప్రస్తుతం AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్‌మెంట్, రియల్-టైమ్ క్రౌడ్ కంట్రోల్ వ్యవస్థలను అమలు చేస్తోంది. అయితే ఇవన్నీ ఆలయంలో భౌతిక మార్పులు చేయకుండా టెక్నాజీపైనే ఆధారపడి ఉన్నాయి. AI సిస్టమ్స్.. ఆగమ శాస్త్రానికి తగ్గట్లుగా ఉండాలి. అంటే ఆలయంలో భౌతిక మార్పులు లేకుండా భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని కాపాడాలి. డేటా గోప్యత కూడా ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీనికి కఠిన ఎన్‌క్రిప్షన్ ప్రోటోకాల్స్ అవసరం. సో ఏది చేసినా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా సులభంగా దర్శనాలు అయ్యేలా చేయాలంటున్నారు భక్తులు.
Story By Vidya Sagar, Bigtv