Pulivendula ZPTC Councing: ఏపీలో ఖాళీ అయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉప ఎన్నిక కౌంటర్ బుధవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. వాటిలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీతోపాటు పలు ప్రాంతాల్లో ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. కడప శివార్లలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
స్వయంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ 10 టేబుళ్ళ ద్వారా మొదటి రౌండ్‌లో ఫలితం రావచ్చని అంటున్నారు. కేవలం 10 వేల ఓట్లు కావడంతో లెక్కింపు వేగంగా అవుతుందని అంటున్నారు. ఒంటిమిట్ట ళ కౌంటింగ్ ఫలితాలు 10 టేబుళ్ళ ద్వారా 3 వ రౌండ్‌లో ఫలితం తేలే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
ఉదయం 10 లేదా 11 గంటలకు ఫలితాలు రావచ్చని అంటున్నారు. ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. కేవలం అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. బుధవారం రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది.
చివరకు వాటిని రీపోలింగ్ ను బాయ్ కట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటన చేసింది. అయితే ఓటర్లు అవేమీ పట్టించుకోలేదు. ఈ.కొత్తపల్లి, అచ్చపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన రీ పోలింగ్‌కు ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. వర్షం కారణంగా ప్రారంభంలో తొలుత పోలింగ్ మందకొడిగా సాగింది.
ALSO READ: వరదలపై హైఅలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్
మధ్యాహ్నానికి పోలింగ్ ఊపందుకుంది. అచ్చవెల్లిలో 68.50 శాతం, ఈ.కొత్తపల్లిలో 54.28 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. పులివెందుల- ఒంటిమిట్ట జెడ్పీ సీట్లకు 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదిలావుండగా తాము గెలుస్తామని అంచనా వేసిన అధికార పార్టీ, ఏర్పాట్లకు రెడీ అవుతోంది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఎన్నిక జరగడంతో గెలిస్తే భారీ ఎత్తున సంబరాలు చేయాలని ఆలోచన చేశారు టీడీపీ నేతలు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.