BigTV English

Breast Cancer:- రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టే మెరుగైన టెక్నాలజీ..

Breast Cancer:- రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టే మెరుగైన టెక్నాలజీ..

Breast Cancer:- క్యాన్సర్ అనేది ఎన్నో విధాలుగా ఇప్పటికీ మనుషులను ఇబ్బంది పెట్టడమే కాకుండా వారు మృత్యువాత పడేలా చేస్తోంది. టెక్నాలజీ పెరగడంతో ఎన్నో రకాల క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉన్నా కూడా అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకున్న క్యాన్సర్‌కు చికిత్సను అందించడం మాత్రం కష్టంగా మారింది. అందుకే ముందుగా క్యాన్సర్‌ను కనిపెట్టే విధానాలనే మెరుగుపరచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.


ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటివరకు రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడం కోసం ఎక్కువశాతం ఆచరణలో ఉన్న విధానం మామ్మోగ్రాఫీ. కానీ రొమ్ము పెద్దగా ఉన్నవారిలో క్యాన్సర్‌ను మామ్మోగ్రాఫీ కచ్చితంగా కనిపెట్టలేదు. అందుకే పలువురు శాస్త్రవేత్తలు కలిసి దీనికంటే మెరుగైన విధానాన్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి సంబంధించి వారు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను కూడా లాంచ్ చేశారు. అదే అల్ట్రాసౌండ్ మిషిన్ లెర్నింగ్.

అల్ట్రాసౌండ్ ద్వారా దాదాపు 98 శాతం కచ్చితంగా రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మామ్మోగ్రాఫీ కూడా పలువురి రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడంలో సహాయపడినా కూడా అది మరింత కచ్చితంగా కనిపెడితేనే చికిత్స మెరుగ్గా అందింవచ్చని వారు అంటున్నారు. ప్రస్తుతం మామ్మోగ్రాఫీ, అల్ట్రాసౌండ్ మధ్య ఉన్న తేడాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. రొమ్ములోని టిష్యూను స్టడీ చేయడమే మామ్మోగ్రాఫీ. ఇక అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ ద్వారా బ్రెస్ట్ ఇమేజ్‌ను పరీక్షిస్తుంది.


అల్ట్రాసౌండ్ అనేది మామ్మోగ్రాఫీ కంటే తక్కువ ఖర్చుతో అయిపోయే ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా అల్ట్రాసౌండ్ అనేది పోర్టబుల్‌గా, రేడియేషన్ లేకుండా ఉంటుందని అన్నారు. ఇది రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడంలో ఎంతగానో ఉపయోగపడినా కూడా ప్రస్తుతం మామ్మోగ్రాఫీ తర్వాత వైద్యులకు అనుమానం ఉంటే మాత్రమే అల్ట్రాసౌండ్‌ను ఉపయోగించడానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్‌తో పాటు బ్రెస్ట్స్‌లో ఉండే ఇతర టిష్యూలను కూడా అల్ట్రాసౌండ్ స్టడీ చేస్తుందని, దానివల్ల క్యాన్సర్‌ను నిర్ధారించడంలో వైద్యులు అయోమయంలో పడే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అల్ట్రాసౌండ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ దీనిని ఉపయోగించాలంటే అనుభవం ఉన్న సోనోగ్రాఫర్ కావాలని వారు తెలిపారు. అందుకే అల్ట్రాసౌండ్ లాంటి టెక్నాలజీతోనే వాల్యూమ్ స్వీప్ ఇమేజింగ్ (వీఎస్సై) లాంటి టెక్నాలజీని వారు కనిపెట్టారు. దీనికి సోనోగ్రాఫర్‌తో పనిలేదని, ఇది కూడా రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వారు శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

Grok 4 : చాట్‌జిపిటి దెబ్బతీయడానికి మస్క్ ప్లాన్.. గ్రాక్ 4 ఏఐ సూపర్ ఆఫర్

Talking In Sleep: నిద్రలో మాట్లాడ్డం ఓ లోపమా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Vivo Y400 5G vs Vivo V60 5G: కొత్తగా లాంచ్ అయిన రెండు వివో ఫోన్లు.. విన్నర్ ఎవరంటే?

Pills Under Tongue: మాత్రను మింగకుండా.. నాలుక కింద పెట్టుకోవాలా? అలా చేస్తే ఏమవుతుందంటే?

Tecno Phantom V Fold 2 5G: సూపర్ ఆఫర్ గురూ.. 12GB ర్యామ్ గల ఫోల్డెబుల్ ఫోన్‌పై రూ.47000 డిస్కౌంట్..

Apple MacBook: కేవలం రూ.52000కే ఆపిల్ ల్యాప్ టాప్.. కొత్త మ్యాక్‌బుక్ త్వరలోనే లాంచ్

Big Stories

×