BigTV English

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. కంటెంట్ కొంచెం నచ్చినా వదలకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అపోకలిప్టిక్ థ్రిల్లర్ సిరీస్ లో సోలార్ ఫ్లేర్స్ వల్ల చాలా మంది గుడ్డివాళ్లవుతారు. ట్రిఫిడ్స్ అనే మాంసాహారి మొక్కలు మానవులపై దాడి చేస్తుంటాయి. వీటినుంచి మానవాళి ఎలాబయటపడుతుందనేదే ఈ స్టోరీ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

‘ది డే ఆఫ్ ది ట్రిఫిడ్స్’ (The Day of the Triffids) రిచర్డ్ మ్యూస్ సృష్టించిన BBC టీవీ మినీ-సిరీస్. ఇందులో డౌగ్రే స్కాట్ (బిల్ మాసెన్), జోలీ రిచర్డ్‌సన్ (జో ప్లేటన్), ఎడ్డీ ఇజ్జార్డ్ (టొరెన్స్) నటించారు. ఇది 2009 డిసెంబర్ 28, BBCలో రిలీజ్ అయింది. ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ సిరీస్ BAFTA అవార్డ్ ను గెలుచుకుంది. 3 గంటల రన్‌టైమ్ (2 ఎపిసోడ్స్) తో IMDbలో 5.6/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళితే

బిల్ మాసెన్ ట్రిఫిడ్స్ అనే బయో-ఇంజనీర్డ్ మాంసాహారి మొక్కలపై పరిశోధన చేసే శాస్త్రవేత్త. ఒక ట్రిఫిడ్ దాడిలో గాయపడి, కళ్లకు బ్యాండేజ్‌తో ఆసుపత్రిలో ఉంటాడు. ఈ మొక్కలు ఏడు అడుగుల ఎత్తు, విషపూరిత స్టింగర్‌తో దాడి చేస్తాయి. అంతేకాకుండా ఈ మొక్కలు నడవగలవు కూడా. వీటిని ఆయిల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఒక రోజు రాత్రి, సోలార్ ఫ్లేర్స్ ఆకాశంలో కనిపిస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు దాదాపు గుడ్డివాళ్లవుతారు. బిల్, కళ్లకు బ్యాండేజ్ వల్ల ఈ ఫ్లేర్స్‌ని చూడక, చూపు కోల్పోకుండా బతుకుతాడు. దీనివల్ల ఆసుపత్రి గందరగోళంలో ఉంటుంది.

లండన్ వీధుల్లో గుడ్డివాళ్లపై ట్రిఫిడ్స్ దాడులు మొదలవుతాయి. బిల్, జో ప్లేటన్ అనే రేడియో ప్రెజెంటర్‌ని కలుస్తాడు. ఆమె ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఫ్లేర్స్‌ని చూడక బతుకుతుంది. బిల్, రేడియో బ్రాడ్‌కాస్ట్ ద్వారా ట్రిఫిడ్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తాడు. ట్రిఫిడ్ ఎక్స్‌పర్ట్‌ అయిన డెన్నిస్ కలవడానికి వీళ్ళు వెళ్తారు. ఈ సమయంలో, కోకర్ అనే సైనికుడు, సర్వైవర్స్‌ని సేకరిస్తూ, ట్రిఫిడ్స్‌తో పోరాడాలని ప్లాన్ చేస్తాడు. కానీ టొరెన్స్ అనే స్వార్థపరుడు లండన్‌ని తన రాజ్యంగా చేసుకోవాలనుకుంటాడు.

Read Also : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

రెండో భాగంలో, బిల్, కోకర్ ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. అక్కడ అబ్బెస్ డురాంట్ గుడ్డివాళ్లను, బలహీనులను ట్రిఫిడ్స్‌కి బలి ఇస్తుంది. బిల్ దీన్ని వ్యతిరేకిస్తాడు. ఇద్దరు చిన్న అమ్మాయిలను కాపాడుతూ, తన తండ్రి డెన్నిస్‌ని కలవడానికి వెళ్తాడు. డెన్నిస్, ట్రిఫిడ్స్‌ని స్టెరిలైజ్ చేసే మ్యూటెంట్ ట్రిఫిడ్‌ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రయోగంలో ట్రిఫిడ్ స్టింగ్‌కి గురై చనిపోతాడు. బిల్, జో డెన్నిస్ ఇంట్లో కలుస్తారు. ఇక వీళ్ళు ఈ మొక్కలను అంతం చేసి మానవజాతిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వీళ్ళు విజయం సాధిస్తారా ? ఆ మొక్కలకు బలవుతారా ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

OTT Movie : 30 ఏళ్ల ఆంటీతో 23 ఏళ్ల కుర్రాడు… పెళ్ళైనా వదలకుండా… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : తెల్లార్లూ అదే పని… ప్రతి రాత్రి ఒంటరిగా ఆ గదికి… ఏం చేస్తుందో తెలిస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : టీనేజ్ కుర్రాడికి ఇద్దరమ్మాయిల ఓపెన్ ఆఫర్… అందంగా ఉన్నారని సొల్లు కారిస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

OTT Movie : ఓరి దీని వేషాలో… ఈ అమ్మాయేంటి భయ్యా ఇంత వయోలెంట్ గా ఉంది… పొరపాటున ముట్టుకుంటే మసే

Big Stories

×