BigTV English

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Putin, Trump Deals: ఆగస్ట్ ఫిఫ్టీన్త్.. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మాత్రమే కాదు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పుతిన్- ట్రంప్ భేటీ కాబోతున్న రోజుగా ఈ తారీఖు చరిత్రకెక్కనుంది. ఈ భేటీ సందర్భంగా సుదీర్ఘ రష్య- ఉక్రెయిన్ వార్ కి ఎండ్ కార్డ్ పడనుందా? ఆపై భారత్ పై అమెరికా విధిస్తోన్న 50 శాతం సుంకాల మొత్తం తగ్గుందా? అసలు ఎక్కడో రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతుంటే, భారత్ పై యూఎస్ సుంకాల మోత మోగించడమేంటి? ఈ భేటీ కోసం భారతీయులు ఎదురు చూడ్డమేంటి?


చిత్రంగా భారత్ పై నెపం నెడుతోన్న ట్రంప్

మోకాలికీ బోడి గుండుకూ లింకు పెట్టడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా. అసలాయన వ్యూహ ప్రతివ్యూహాలేంటో.. ఎవరికీ ఒక పట్టానా అంతు చిక్కవు. ఉక్రెయిన్ తో రష్యా గత కొన్నేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత సుదీర్ఘ యుద్ధం ఇదే. బేసిగ్గా వార్ ఫినీషర్ గా పేరున్న రష్యా.. ఒక దేశంతో ఇంత కాలం యుద్ధం చేయడం ఇదే మొదటి సారి. ఈ విషయంలో తప్పంతా రష్యా కానీ ఉక్రెయిన్ ది కానీ అయి ఉండాలి.. విచిత్రమైన విషయం ఏంటంటే.. భారత్ ని నిందిస్తూ సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. రష్యా- ఉక్రెయిన్ వార్ విషయంలో భారత్ చేసిన పాపమల్లా ఒకటే.. చౌకగా వస్తుందన్న కోణంలో రష్యా నుంచి చమురు కొనడమే. ఈ చమురు ద్వారా భారత్ రష్యా… ఉక్రెయిన్ తో చేసే యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని ఆరోపిస్తున్నారు ట్రంప్. సరిగ్గా అదే సమయంలో ఉక్రెయిన్ తో ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అదేమంత తప్పు కానట్టు వ్యవహరిస్తున్నారు.


భారత్‌ను మాత్రమే టార్గెట్ చేస్తోన్న ట్రంప్

ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో ఒక దేశం తనకు సంబంధం లేని ఒక యుద్ధం కారణంగా.. ఇంత పెద్ద ఎత్తున సుంకం ఎదుర్కుంటోంది కేవలం భారత్ మాత్రమే అయి ఉంటుంది. చైనా కూడా మనతో సమానంగా రష్యా నుంచి చమురు కొంటున్నా సరే అదేదీ లెక్కించని ట్రంప్ కేవలం భారత్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ.. సుంకాల మోత మోగిస్తున్నారు. మొదట 26 శాతం అన్నారు. ఆపై ఒక శాతం తగ్గించి.. 25 శాతం అన్నారు. ఆపై 25 శాతం అదనపు పెనాల్టీ విధిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మన పొరుగు దేశాలైన పాక్ పై 19 శాతం కాగా, బంగ్లాపై 20 శాతం మాత్రమే విధించిన ట్రంప్.. భారత్ పై మాత్రం 50 శాతం టారీఫులతో నరకం చూపిస్తానంటున్నారు.
భారత్ పై ఇంత పెద్ద ఎత్తున సుంకాలు విధించడానికి ప్రధాన కారణం.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం. రష్యా ఆయిల్ కొంటూ ఆ దేశానికి భారత్ నిధులు సమకూర్చి పెడుతోందన్నది అమెరికా ప్రధాన అభియోగం. కాబట్టి రష్యన్ అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ కూడా ఈ భేటీ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా పుతిన్‌ని ట్రంప్ ఒప్పిస్తారా?

ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్- పుతిన్ భేటీ జరగనుంది. ఈ విషయం ట్రంప్ స్వయంగా శనివారం నాడు తనసోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియ చేశారు. తాను రష్యా అధ్యక్షుడ్ని కలుసుకోబోతున్నట్టు చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాధినేతలు భేటీ కానుండటంతో.. ఇరు వర్గాల మధ్య ఉత్కంఠ భరితంగా మారింది. ఇంతకీ ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముగించే దిశగా పుతిన్ ని ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ కి సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్టు కూడా ప్రకటించారు ట్రంప్. ఎలాగైనా సరే ఈ యుద్ధానికి చరమగీతం పాడి.. తాను నిజంగానే శాంతి దూతగా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు ట్రంప్.

1867 వరకూ రష్యాలో భాగం అలస్కా

ఆగస్ట్ 15 నాడే ఎందుకు? అలస్కానే వేదికగా ఎందుకు ప్రకటించినట్టు? అనే ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవల్సి ఉంది. అలస్కా 1867 వరకూ రష్యా సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. నాటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్- 2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటీష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్టు చెబుతుంటారు. 19వ శతాబ్దిలో ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఇదీ ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూ భాగం విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే సుమారు 9 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తారు. బంగారం సహా సహజ వనరులకు లోటు లేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతుగా ఉంటుందీ ప్రాంతం. అలస్కాతో రష్యాకు అంతటి చారిత్రక అనుబంధముంది. ఇక ఆగస్టు 15 విషయానికి వస్తే.. ఇద్దరు ప్రపంచ నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీ కూడా చెప్పుకోదగినదిగానే అయి ఉంటుంది. ఆగస్ట్ 15 కేవలం భారత్ కి స్వాతంత్రం వచ్చిన తేదీ మాత్రమే కాదు.. ఇందుకు మరో చారత్రక ప్రాధాన్యత సైతం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ కూడా ఆగస్ట్ పదిహేనే.

మౌంట్ బాటన్‌కి ఇష్టమైన ఆగస్ట్ 15 తేదీ

జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. దానికి తోడు ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఈ ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా.. సరిగ్గా రెండేళ్లకు ఇండియాకి ఫ్రీడం వచ్చింది. ఈ తేదీతో ఉన్న మరో రిలేషన్ ఏంటంటే.. జపాన్‌లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటెన్‌ ముందుండి నడిపించారు. ఆ యుద్ధంలో విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్‌బాటెన్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ హోదాలో.. 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణంగా చెబుతారు. అలాంటి చారత్రిక ప్రాధాన్యతగల ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్‌ కలుసుకోబోతున్నారు.

ఆగస్ట్ 15.. భారత్‌కి మేలు చేసిన తారీఖుగా పేరు

భారత్ కి కూడా ఈ తేదీ ఎంతో మేలు చేసింది.. మరి ఈ తారీఖున జరిగే ఇరువురు అగ్రనేతల భేటీ ద్వారా భారత్ కి లబ్ధి చేకూరేనా? అయితే ఇదంతా రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయనగానీ భారత్ మేలు కోరే పనైతే.. ఈ యుద్ధాన్ని తేలిగ్గా ముగించడానికి ప్రయత్నించవచ్చు. కానీ అదే జరుగుతుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక భారత్ లోనూ పుతిన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో భారత్ శ్రేయస్సు కాంక్షించి పుతిన్ ఈ యుద్ధానికి చరమగీతం పాడుతారా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తో పుతిన్ భేటీ సందర్భంగా.. రష్యా- ఉక్రెయిన్ వార్ ఆగే అవకాశమెంత? ట్రంప్ చెప్పగానే పుతిన్ ఒప్పుకుంటారా?ఈ వార్ ప్రెజంట్ కండీషనేంటి? అసలీ భేటీకి కారణం ఇదేనా? లేక ఇంకేదైనా ఉందా? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఆ వివరాలు ఎలాంటివి?

2022 ఫిబ్రవరి 24న పూర్తి యుద్ధంగా మార్పు

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఎలా ఉందంటే.. రష్యా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం అన్నదెక్కడా కనిపించడం లేదు. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ దూకుడు ఏమంత తగ్గడం లేదు. మొన్నటికి మొన్నరెండో విడుత చర్చలు ప్రారంభమవుతాయనగా.. ఉక్రెయిన్ రష్యన్ ఎయిర్ బేస్ టార్గెట్ గా డ్రోన్ దాడి చేసింది. ఇది పెర్ల్ హార్బర్ ఘటనతో పోల్చుతారు కొందరు యుద్ధ నిపుణులు. ఒక వేళ నిజంగానే ఉక్రెయిన్ కి యుద్ధం ఆగాలన్న ఆలోచన ఉంటే ఇలా చేసేది కాదని కూడా అంటారు. 2022 ఫిబ్రవరి 24న పూర్తి యుద్ధంగా మారిన రష్యా- ఉక్రెయిన్ వార్ కారణంగా.. 3. 7 మిలియన్ల మంది నిరాశ్రయులు కాగా.. 6. 9 మిలియన్ల మంది పోలాండ్, హంగేరి, మోల్డోవా తో పాటు ఇతర దేశాలకు శరణార్దులుగా వెళ్లారు. ప్రస్తుతం పోలెండ్ ఒక మిలియన్ శరణార్ధులకు ఆతిథ్యం ఇచ్చినట్టు చెబుతాయి ఐక్యరాజ్య సమితి గణాంకాలు.

దారుణంగా దెబ్బతిన్న ఇంధనం, తాగునీరు వ్యవస్థ

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ అంతటా విపరీతమైన ప్రాణ నష్టంతో పాటు.. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఇంధన సంక్షోభం మాత్రమే కాదు.. ప్రజలకు కనీస తాగునీరు, విద్యుత్, విద్య వైద్య సదుపాయాలు సరిగా అందడం లేదు. ఇక్కడెలాంటి పరిస్థితి ఉందంటే.. రెండున్నర మిలియన్లకు పైగా ఇళ్లలో 13 శాతం దెబ్బ తినగా.. కొందరు ఇప్పటికీ శిథిలాలలో నివసిస్తున్నారు. ఆపై కొందరు గడ్డకట్టే చలిలో గజగజ వణుకుతున్నారు. 2025 నాటికి ఉక్రెయిన్ లో 12. 7 మిలియన్ల మందికి మానవతా సాయం అత్యవసరమని రిపోర్ట్ చేస్తోంది యూఎన్. సుమారు కోటిన్నర మంది ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీని ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది.

లైంగిక దాడుల్లో 76 శాతం మంది మహిళలు, పిల్లలు

మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు, దివ్యాంగులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. సంక్షోభం నుంచి తప్పించుకోవాలని శరణార్దులుగా వెళ్లిన వారిలో 76 మంది మహిళలు పిల్లలు లైంగిక దాడులు ఎదుర్కునే ప్రమాదంలో పడ్డారని అంటోంది ఐక్యరాజ్య సమితి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్.. నాలుగు లక్షలకు పైగా ఎమర్జెన్సీ కిట్స్, ఇతరత్రా సామాగ్రిని అందించింది. 3 లక్షల మంది బాధితులకు మానసిక సామాజిక న్యాయం చేసింది. 37 వేలకు పైగా ఇళ్లను మరమ్మతులు చేసింది. ఈ విధ్వంసం ద్వారా దెబ్బ తిన్నవారిని రాత్రికి రాత్రి రక్షించడం సాధ్యమయ్యే పనికాదని అంటుంది ఐక్యరాజ్య సమితి. మూడేళ్ల పాటు వీరు తమ తమ ఉద్యోగాలు, ఇళ్లు వాకిళ్లు, పాఠశాలలు, ఎందరో ఆప్తులను కోపోయినట్టు చెబుతాయి గణాంకాలు.

డొనెస్క్-లుహాన్స్క్‌లను ఆక్రమించిన రష్యా

డోన్ బాస్ గా పిలిచే డొనెస్క్- లుహాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించింది రష్యా. ఈ ప్రాంతాల్లోని కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేస్కుంది ఉక్రెయిన్. ఈ యుద్ధం కారణంగా రష్యా- ఉక్రెయిన్ రెండు దేశాలూ ఆర్ధికంగా దెబ్బ తిన్న పరిస్థితి. ఉక్రెయిన్ భారీ ఎత్తున ఆస్తినష్టం చవి చూడగా.. రష్యా సైతం ఆర్ధిక మాంధ్యంలోకి ప్రవేశించింది. యురోపియన్ యూనియన్.. రష్యాపై ఆంక్షలు విధించగా.. ఉక్రెయిన్ కి ఇటు ఆర్ధిక సాయంతో పాటు ఆయుధాలను సైతం సరఫరా చేస్తోంది.

డొనెట్స్కోలోని 30 శాతం భూభాగం కోరుతున్న పుతిన్

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న డొనెట్స్కోలోని 30 శాతం భూభాగం తిరిగి అప్పగించాలని ప్రతిపాదిస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ స్పందిస్తూ.. ఇందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటారు. ఈ ప్రాంతాన్ని తామిపుడు వదులుకుంటే వచ్చే రోజుల్లో రష్యా.. తమపై దాడులు చేయడానికి మరింత అనువుగా మారుతుందని అంటారాయన. పుతిన్ తో భేటీకి ముందు జెలన్ స్కీ ఈ విషయాలన్నిటినీ తమ తరఫు మాట్లాడాల్సిందిగా ట్రంప్ ని కోరినట్టు తెలుస్తోంది.

మీ భూభాగంలో మా నియంత్రణ ఉండాల్సిందే-రష్యా

ఒక పక్క జెలన్ స్కీ ట్రంప్ ద్వారా వ్యవహారం చక్కబెట్టాలని ప్రయత్నిస్తుండగా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో పుతిన్ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ వార్ లో కిమ్ చేసిన సాయం మరువలేనిదిగా ప్రశంసించారు పుతిన్. కిమ్ సైనికుల ధైర్య సాహసాలు ప్రాణ త్యాగాలు మరువలేని వని అన్నారాయన. కుర్క్స్ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవడంలో వారి సహకారం ఎంతో ఉందని అన్నారు. ట్రంప్ తో ఏం మాట్లాడాలో ఇరువురు దేశాధ్యక్షులు చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల రష్యా- ఉత్తర కొరియాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేస్కున్నాయి. రష్యన్ సైన్యానికి మద్ధతుగా దళాలను పంపడంతో పాటు.. కిమ్ ఆయుధాలను సైతం పంపారు. గతేడాది ఇరు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం సైతం జరిగింది.

Also Read: బీఆర్‌ఎస్‌ బీసీ సభ వాయిదా.. కారణం అదేనా?

ట్రంప్- పుతిన్ భేటీ నాటికి వార్ కండీషనేంటంటే.. రష్యా నుంచి తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుకుంటుండగా.. ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాల్లో తమ నియంత్రణ కొనసాగాలని భావిస్తోంది రష్యా. మరి ఈ కండీషన్లో పుతిన్ ను ట్రంప్ ఒప్పించగలరా? తెలియాల్సి ఉంది.

Story By Adinarayana, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Big Stories

×