CPI Narayana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారు. ఈసారి టార్గెట్ చేసింది మాత్రం వైసీపీ కాదు.. ఇంతకు ఎవరని అనుకుంటున్నారా? ఆయన మాటెత్తితే కొందరు ఫైర్ అవుతారు. మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కదా అంటూ ఆయనకు సపోర్ట్ వస్తారు. ఇచ్చిన మాట కోసం ఏడాది ఇడ్లీ, చికెన్ తినని ఈయన, లేటెస్ట్ గా పవన్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల దుమారం రేగే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పవన్.. మూడు పెళ్లిళ్ల అంశం తెరపైకి తెచ్చి, సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కు దమ్ముందా? ఉంటే ఇలా చేయగలడా అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీని ఊపేస్తున్నాయి. ఇంతలా ఆయన గురించి చెప్పాక ఆయనెవరో తెలిసిపోయిందా? ఔను ఆయనే సిపిఐ నారాయణ.
ఈయన స్పీడ్ వెనుక..
సీపీఐ నారాయణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. అసలే కామ్రేడ్ కాబట్టి ఈయన కామెంట్స్ అలా ఉంటాయి మరి. ఏపీలో లిక్కర్ రేట్లు తగ్గించిన సమయంలో ఏకంగా వైన్స్ షాపుకు వెళ్లి, మందుబాబులతో ముచ్చటించడంతో ఈయన రూటే సపరేట్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల కాస్త స్పీడ్ పెంచి డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇలా నారాయణ స్పీడ్ వెనుక పెద్ద కారణమే ఉందని ప్రచారం సాగుతోంది.
పవన్ టార్గెట్.. బిగ్ బాంబ్ విసిరిన నారాయణ
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు వెనుకాడనని పలుమార్లు ప్రకటించారు. ఆ మేరకు ఇటీవల తిరుమల లడ్డు విషయంలో సైతం పవన్ దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. అంతేకాదు తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ అంటూ సనాతన ధర్మ పరిరక్షణ అంశంపై ఎన్నో కీలక తీర్మానాలు చేశారు. ఆ సమయం నుండి పవన్ సనాతని అంటూ ఆయనపై ప్రచారం జోరుగా సాగింది.
ఆ ప్రచారం పక్కన పెడితే, ఇక విమర్శలు కూడా అదే జోరుగా వచ్చాయని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సంధర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సిపిఐ నారాయణ తాజాగా బిగ్ బాంబ్ లాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు పొలిటికల్ చర్చకు దారితీసింది. అంతేకాదు పెద్ద వివాదమే చెలరేగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
Also Read: World’s Tallest Statue: ఏపీ సరిహద్దులో ఉన్నారా? ఈ అద్భుతం చూడకుంటే.. చాలా మిస్ అయినట్లే!
పవన్ మూడు పెళ్లిళ్లపై.. ఇలా చేసే దమ్ముందా?
సనాతన ధర్మం నెత్తిన పెట్టుకున్న పవన్ కు నారాయణ ఓ సవాల్ విసిరారు. సనాతన ధర్మంలో విడాకుల అంశం లేనే లేదని, మరి పవన్ విడాకులు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు పవన్ సనాతని కాబట్టి దీనికి సమాధానం చెప్పాలన్నారు. సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని నారాయణ అన్నారు.
గరికపాటి కంటే పాలెగాడివా?
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు గరికపాటి నర్సింహా రావు కంటే పవన్ పెద్ద పాలేగాడు కాదని నారాయణ అన్నారు. ఒకసారి పవన్ నేరుగా గరికపాటిని కలిసి పలు విషయాలు తెలుసుకోవాలని నారాయణ హితవు పలికారు. సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత వెదవ పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలని, చివరికి భర్త చనిపోతే అదే చితిమంటలో భార్యను కూడా తగలబెడతారనేది సారాంశమని నారాయణ వర్ణించారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు ఎలా ఇచ్చారని ఆయన పునరుద్ఘాటించారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ తెలిపారు.
పవన్ మాటేంటి?
సిపిఐ నారాయణ కాస్త లైన్ దాటి విమర్శలు గుప్పిస్తున్న పవన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గరికపాటికి మించిన జ్ఞానం పవన్ కు ఉందా అంటూ నారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై జనసేన ఫైర్ అవుతుండగా, పవన్ స్పందన ఎలా ఉందనున్నదే ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. మొత్తం మీద నారాయణ వర్సెస్ పవన్ మధ్య ఈ వార్ హీటెక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.