World’s Tallest Statue: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నారా? బెంగళూరులోనే ఉన్నారా? లేక నగరానికి తక్కువ దూరంలో ఉన్నా, ఈ అద్భుతాన్ని చూడకపోతే నిజంగా మీరు జీవితంలో ఓ విశేష అనుభూతిని కోల్పోతారు. శిల్పకళ, ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధ.. ఇవన్నీ ఒకే విగ్రహంలో ప్రతిబింబించినట్లుగా తయారైన ప్రపంచంలోనే అతి పొడవైన విష్ణువు విశ్వరూప విగ్రహం ఇప్పుడు బెంగళూరులో ఈజిపురాలో వెలుగులు విరజిమ్ముతోంది. 108 అడుగుల ఎత్తుతో, ఏకశిలా రూపంలో, అచ్చం శిల్పకారుడి ఆధ్యాత్మిక సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ విగ్రహం ఇప్పుడు లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది. ఇది కేవలం చూడదగ్గ శిల్పం కాదు.. దర్శించాల్సిన దైవ రూపం!
ఇదొక అద్భుతం.. చూసి తీరండి
మన దేశంలో ప్రతి దేవాలయం వెనకా, ప్రతిమ వెనకా ఒక అద్భుత కథ ఉంటుంది. అలాంటి మరొక ఆధ్యాత్మిక, శిల్ప కళా చరిత్రను ఇప్పుడు బెంగళూరు నగరం తన ఒడిలో తీసుకుంది. అక్కడ ఈజిపురా ప్రాంతంలోని 75 ఏళ్ల పాత కోదండ రామస్వామి ఆలయంలో ప్రపంచంలోనే అతి పొడవైన విష్ణు విస్వరూప విగ్రహం ఉత్సాహంగా భక్తుల ముందు ఆవిష్కృతమైంది.
ఈ మహత్తర విగ్రహం వెనక ఒక విశేష కథ ఉంది. ఇది కేవలం శిల్ప కళకు పరిమితమైన విషయం కాదు, దాని వెనకున్న వ్యక్తి సంకల్ప బలానికీ, ఆధ్యాత్మికత పట్ల ఉన్న విశ్వాసానికీ గాథ. ఈ విగ్రహాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్రధారి డా. బి. సదానంద్, ఒక రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన 2010లోనే ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. ఒక వైద్యుడి నుండి శిల్పకారుడిగా మారడమంటే ఏ స్థాయిలో ధైర్యం, భక్తి అవసరమో ఊహించవచ్చు.
108 అడుగుల విగ్రహం..
ఈ విస్వరూప విగ్రహం పొడవు ఏకంగా 108 అడుగులు. దాని బరువు సుమారు 420 టన్నులు. ఇది ఏ చిన్న విషయం కాదు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన రాయి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాలోని కోరకొట్టై గ్రామం సమీపంలోని ఓ కొండ నుండి తవ్వారు. అక్కడి నుండి ప్రాసెసింగ్ మొదలుపెట్టి, నెమ్మదిగా, ప్రతీ మిల్లీమీటరును శ్రమతో చెక్కుతూ రూపమిచ్చారు.
2019లో రాక..
ఈ మహావిగ్రహాన్ని బెంగళూరుకు రవాణా చేయడంలో ఎదురైన సవాళ్ళు చెబుతే ఆశ్చర్యం కలుగుతుంది. 240 చక్రాల ట్రక్కుపై ఈ శిల్పాన్ని తీసుకొచ్చారు. ఇది 2019 మేలో ఆలయానికి చేరింది. నాలుగేళ్ల పాటు శిల్ప పనులు, మెరుగుదలలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాక చివరికి ఈ ఏడాది ఆవిష్కరణ జరిగింది.
ఈ విగ్రహాన్ని పెట్టిన ఆలయం కోదండ రామస్వామి ఆలయం, ఈజిపురాలో ఉన్నది. ఇది సుమారు 75 ఏళ్ల పాత దేవాలయం. ఇక్కడ రామునితో పాటు లక్ష్మణుడు, సీతాదేవి కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు ఈ విస్వరూప విష్ణువు రావడంతో ఆలయ మహత్యం మరింత పెరిగింది.
Also Read: IAF Notification: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పది, ఇంటర పాసైతే చాలు
ఈ విగ్రహంలో విష్ణుమూర్తి విశ్వరూపాన్ని పొందుపర్చడం విశేషం. పంచజన్య శంఖం, సుదర్శన చక్రం, గదా, పద్మం లాంటి ఆయుధాలతో విభిన్న దిశల్లో విస్తరించిన రూపంలో కనిపించే ఈ విగ్రహం భక్తులకి భయాన్ని తొలగించే శక్తిగా నిలుస్తోంది. ఇది కేవలం శిల్పం మాత్రమే కాదు.. ఇది భక్తి, శ్రద్ధ, మన తాత్వికతకు ప్రతిరూపం.
విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన రాయి మొత్తం ఒక్కటే. అంటే ఏకశిలా శిల్పం. ఇలాంటి శిల్పాలు భారతీయ శిల్ప కళలో అరుదైనవి. ఇది చూడటానికి, దర్శించటానికి, ఆరాధించటానికి దేశం నలుమూలల నుండి భక్తులు రావడం మొదలుపెట్టారు.
ఇకపోతే, దీని ఆవిష్కరణకు అనేక మంది ప్రముఖులు, స్థానిక అధికారులు, భక్తులు హాజరయ్యారు. ఈ విగ్రహం వల్ల బెంగళూరులో ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఉత్సాహం ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిమ ఇప్పుడు దేవత సాక్షిగా నిలిచింది.
భవిష్యత్తులో ఈ విగ్రహం కేంద్రంగా ధార్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు, జ్ఞాన పరంపర కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఇది కేవలం విశేషమైన శిల్పకళ మాత్రమే కాదు.. భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఆరంభమని స్థానికులు అంటున్నారు.