BigTV English

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

Dance by 350 artistes.. an international record at Mantralayam: ఆదివారం మంత్రాలయంలో జరిగిన భరత నాట్య ప్రదర్శన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం, చెన్నరాయపట్నం హాసన్ కు చెందిన జాతీయ సంప్రదాయ నృత్య అకాడమీ కలిస ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో 350 మందికి పైగా భరతనాట్య కళాకారిణులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఆదివారం సాయంత్రం అందరూ కలిసి ఏక కాలంలో నృత్యాభినయం చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ నాట్య ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి నాట్య కళాకారిణులు పాల్గొనడం విశేషం. దాదాపు 15 నిమిషాల పాటు రామ నామ గీతాలు ఆలపిస్తూ సాగిన ఈ దృశ్య వేడుక అహూతులను అలరించింది.


వివిధ దేశాలనుంచి..

వివిధ దేశాలనుంచి వచ్చిన కళాకారిణులు భారత శాస్త్రీయ నృత్యాన్ని అత్యంత శ్రద్ధతో చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడో జర్మనీ, జపాన్, ఇండోనేషియా దేశాలనుంచి ఈ కళాకారులు రావడం విశేషం. మంత్రాలయంలో నిర్వహిస్తున్న 353వ సప్త రాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారంరోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలనుసర్వ సమర్పణతో ముగింపు పలికారు పీఠాధిపతి.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×