BigTV English

Shraddha Kapoor: టాప్‌లో శ్రద్ధా‌కపూర్.. ప్రియాంకచోప్రాను వెనక్కి నెట్టేసి..

Shraddha Kapoor: టాప్‌లో శ్రద్ధా‌కపూర్.. ప్రియాంకచోప్రాను వెనక్కి నెట్టేసి..

Shraddha Kapoor: హీరోయిన్ శ్రద్ధాకపూర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించకుండానే ఇన్‌స్ట్రాలో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. అదెలా సాధ్యం.. అంటూ బాలీవుడ్ బ్యూటీలు అప్పుడే గుసగుసలు మొదలుపెట్టేశారు.


బాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన నటిస్తే బోలెడంత ఫేమ్ వస్తుంది. ఆ తర్వాత అవకాశాలకు కొదవ ఉండదు. అంతేకాదు నెంబర్ వన్ స్థాయిని సొంతం చేసుకోవచ్చు. ఇదంతా ఒకప్పటి మాట. సల్మాన్, షారూఖ్, అమీర్ ఖాన్ల పక్కన నటించకుండానే సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది హీరోయిన్ శ్రద్ధాకపూర్.

రీసెంట్‌గా శ్రద్ధాకపూర్ లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ స్త్రీ 2. ఈ చిత్రం బాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తోంది. రిలీజైన సెకండ్ డే అత్యధిక కలెక్షన్లను (దాదాపు 34 కోట్ల రూపాయలను) రాబట్టింది. 2018లో సూపర్ హిట్టయిన స్త్రీ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.


ALSO READ:  డార్లింగ్ ప్రభాస్ పై అంత మాట అనేసిందేమిటి మాళవిక?

శ్రద్ధాకపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రభాస్‌తో సాహోలో నటించి తెలుగు అభిమానులకు దగ్గరైంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌కు ఇన్‌స్టాలో 92 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 9 కోట్ల 20 లక్షల మంది. గతంలో ప్రియాంకచోప్రా తొలి ప్లేస్‌లో ఉండేది.. స్త్రీ 2 మూవీతో ఆమెని అధిగమించి నెంబర్ వన్ ప్లేస్ సొంతం చేసుకుంది శ్రద్ధాకపూర్.

ఇండియాలో ఇన్‌స్టాలోని అత్యధిక ఫాలోవర్స్ ఉన్న జాబితాలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్‌లో శ్రద్ధాకపూర్, థర్డ్‌లో ప్రియాంకచోప్రా, ఫోర్త్‌లో ప్రధాని నరేంద్రమోదీ, అలియాభట్ టాప్ ఫైవ్‌లో ఉంది. స్త్రీ మూవీ కారణంగానే శ్రద్ధాకు టాప్ ప్లేస్ వచ్చిందని అంటున్నారు.

స్త్రీ మూవీ హిట్టయిన తర్వాత ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. 37ఏళ్ల వయసున్న శ్రద్ధాకు.. 17 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ సరసన లక్కీ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. గతంలో ఖాన్ల త్రయంతో సినిమా ఆఫర్లు వచ్చాయని, అనేక కారణాల వల్ల వాటిని చేయలేకపోయానని తెలిపింది.

మంచి కథలు, డైరెక్టర్లతో పని చేయాలని కోరుకుంటున్నానని మనసులోని మాట బయటపెట్టింది  హీరోయిన్ శ్రద్ధాకపూర్. నెంబర్ వన్ స్థానాన్ని కంటిన్యూ చేస్తుందా? అన్నది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రియాంక‌చోప్రా నుంచి ఆమెకు గట్టి పోటీ ఉందని అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×