Tan Removal Tips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఫంక్షన్లు, పండగల సమయంలో అందికంటే కాస్త అందంగా కనిపించాలని తాపత్రయపడుతువటారు. అయితే ఇలాంటి వారు కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్రత్యేక సందర్భంలో మీ ముఖం విభిన్నంగా , ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే అందంగా కనిపించడం కోసం కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. వీటిని వాడటం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతే కాకుండా వీటి వల్ల ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే పదార్థాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. మరి ముఖం తెల్లగా మెరవడానికి, ట్యాన్ పూర్తిగా పోవడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్ లను ఉపయోగపడతాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ ప్యాక్స్ తయారీ:
1. శనగ పిండి, పసుపుతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 టీస్పూన్- శనగపిండి
1/2 టీస్పూన్ -పసుపు
1/2 టీస్పూన్- రోజ్ వాటర్
తయారీ విధానం: ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి పైన చెప్పిన మోతాదుల్లో రోజ్ వాటర్‌లో శనగపిండి , పసుపు కలిపి పేస్ట్‌లా చేయండి. తర్వాత మీ ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
ప్రయోజనం: పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి .శనగ పిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ ప్యాక్ ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
2. కలబంద, తేనెతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 tsp – అలోవెరా జెల్
1 tsp- తేనె
తయారీ విధానం: కలబంద , తేనెను పైన చెప్పిన మోతాదుల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనం: కలబంద, తేనె రెండూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని మృదువుగా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.
3. పెరుగు, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 tsp- పెరుగు
1/2 tsp- నిమ్మరసం
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో పెరుగు, నిమ్మరసం బాగా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. తర్వాత 15-20 నిమిషాలు ఆగి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
ప్రయోజనం: పెరుగు చర్మానికి పోషణనిస్తుంది. నిమ్మరసం టానింగ్, మచ్చలను తేలికపరుస్తుంది. ఈ ప్యాక్ ముఖం రిఫ్రెష్ చేయడంతో పాటు మెరుస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
4. బంగాళదుంప, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 టేబుల్ స్పూన్- బంగాళదుంప పేస్ట్
1 టీస్పూన్- రోజ్ వాటర్
తయారీ విధానం: పై న చెప్పిన మోతాదుల్లో బంగాళాదుంప పేస్ట్‌తో పాటు రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. తర్వాత ఇది ముఖానికి 15 నిమిషాలు పట్టించి ఆపై కడిగేయండి.
ప్రయోజనాలు: బంగాళాదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై మచ్చలను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ ప్యాక్ ముఖానికి మెరుపును అందించడంలో సహాయపడుతుంది.
5. బొప్పాయి, పాలతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
1 tsp – బొప్పాయి పేస్ట్
1 tsp- పాలు
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. వీటిని పక్కా వాడాల్సిందే !
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బొప్పాయి పేస్ట్ తీసుకుని అందులో పాలు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనం: బొప్పాయిలో మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడే ఎంజైమ్‌లు ఉన్నాయి. పాలు చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా,మెరుస్తూ ఉండేలా చేస్తుంది.