BigTV English

Pawan Kalyan : సనాతన బోర్డు ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ సిద్ధం

Pawan Kalyan : సనాతన బోర్డు ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ సిద్ధం

Pawan Kalyan : కొన్నాళ్లుగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వివక్షపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మ పరిరక్షణకు తన రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. ఇందులో కీలక ఘట్టానికి ముహుర్తం ఖరారు చేశారు. లౌకిక వాదం దేశంగా అన్ని మతాల్ని సమానంగా చూడాల్సిన చోట.. హిందువులు మెజార్టీగా ఉండి కూడా అనేక వివక్షలకు గురవుతున్నారంటూ కొన్నాళ్లుగా దేశంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా.. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని భక్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని, హిందూ ధార్మిక కార్యక్రమాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో అనేక మంది ఆగ్రహానికి కారణమవుతోంది.


మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా..  జనసేనా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అనేక సార్లు హిందూ ధర్మం పక్షాన నిలిచారు. ఆలయాలపై దాడులు, అన్యమతస్తుల చేతిలో ఆలయాల పరిపాలన ఉంచడం సహా ప్రసాదాల కల్తీ వంటి విషయాలపై గళం విప్పారు. గతంలో ఏ రాజకీయ నాయకులు చేయని సాహసం చేసిన ఆయన.. హిందూ ధర్మం అంటే భారతీయ ఆత్మ అంటూ బహిరంగంగానే వెల్లడించారు. ఆ దశలోనే దేశంలో మిగతా మతాలకు ఉన్నట్లుగానే హిందూ ధర్మం రక్షణ కోసం సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనేక తీరులుగా హిందువులను విడిదీస్తున్న విధానానికి స్వస్తి చెప్పి.. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న అందరికీ కులాలు, వర్గాలు, జాతులతో సంబంధం లేకుండా సనాతన  బోర్టు పని చేస్తుందని వెల్లడించారు.

ఆయన చెప్పినట్లుగానే.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి రోడ్ మ్యాప్ ను అమలు చేస్తున్నారు. ఆలయాలు, ఘనమైన హిందూ వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న దక్షిణ భారత ఆలయాలను దర్శించుకునేందుకు నిర్ణయించారు. ఏకంగా.. ఐదురోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్.. కేరళ, కర్ణాటక, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. తొలుత త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత


దేశంలో హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయ పరిపాలనను పారదర్శకంగా నిర్వహించడం, హిందూ ధార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాముఖ్యమైన హిందూ దేవాలయాలను సందర్శించేందుకు సిద్ధమయ్యారు.తిరుపతి, శబరిమల, రమణ మహర్షి ఆశ్రమం, మదురై మీనాక్షి ఆలయం, కంచి కామాక్షి పీఠం లాంటి పవిత్ర స్థలాల్లో పూజలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆలయ పరిపాలనలో ఉండే ప్రత్యేకతలను అధ్యయనం చేయనున్నారు.

ఈ సనాతన బోర్డు ద్వారా హిందూ ధర్మానికి చెందిన ఆలయాల ఆదాయాన్ని పారదర్శకంగా నిర్వహించాలని,  భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. సనాతన గ్రంథాలు అధ్యయనంలోనే జీవితాన్ని ధారపోసిన పూజారుల సంక్షేమానికి కట్టుబడాలంటున్నారు. ముఖ్యంగా.. ఆదాయం కోసం ఆలయాలను స్వాధీనంలోకి తీసుకున్న ప్రభుత్వాలు.. క్రమంగా ఆలయాలను స్వతంత్రతపై సమగ్ర సమీక్ష చేపట్టాలని పిలుపునిస్తున్నారు.

ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్.. గత ప్రభుత్వ హాయంలో హిందూ దేవాలయాలపై దాడుల విషయాన్ని ప్రస్తావించారు. హిందూ దేశంలో హిందువులపై దాడులను సహించేది లేదని వెల్లడించారు. అందుకోసం.. అంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే.. 24 అక్టోబర్ 3న తిరుపతిలో జరిగిన ‘వారాహి’ సభలో ‘వారాహి డిక్లరేషన్’ను ప్రకటించారు. ఇందులో సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన ఏడు ముఖ్య అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

వారాహి డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు :

  1. లౌకికవాదం : ఏ మతానికి లేదా ధర్మానికి భంగం వాటిల్లినా, సమానంగా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి.
  2. సనాతన ధర్మ పరిరక్షణ చట్టం: సనాతన ధర్మాన్ని పరి రక్షించేందుకు, ఆ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టం అవసరం.
  3. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు: ఈ చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి.
  4. దేవాలయాల ఆస్తుల సంరక్షణ: దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
  5. నైవేద్యాల స్వచ్ఛత: ఆలయాల్లో నైవేద్యాలు, ప్రసాదాల్లో ఉపయోగించే వస్తువుల స్వచ్ఛతను క్రమం తప్పకుండా చాలా కఠినంగా పరీక్షించాలి.
  6. సనాతన ధర్మంపై దాడుల నివారణ: సనాతన ధర్మాన్ని అవమానించే చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
  7. సనాతన ధర్మ ప్రచారం: సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, మన ఘనమైన వారసత్వాన్ని అందరికీ తెలిపేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.

ఈ డిక్లరేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. అదే విధంగా, సనాతన ధర్మాన్ని అవమానించే చర్యలను అరికట్టేందుకు కఠిన చట్టాలు అవసరమని, దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలనే అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు.. ఆయా అంశాల్లో దేశవ్యాప్త మద్ధతు కూడగడ్డడంతో పాటు ప్రముఖ ఆలయాలలో నిర్వహణ పద్ధతులను పరిశీలించేందుకు ఈ పర్యాటన చేపట్టారు.

Also Read :  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భావోద్వేగం.. అసలేం జరిగిందంటే?

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×