BigTV English

RC16: సెట్ లో లిటిల్ గెస్ట్.. తండ్రితో క్లింకార.. జాతర సీన్ లీక్

RC16: సెట్ లో లిటిల్ గెస్ట్.. తండ్రితో క్లింకార.. జాతర సీన్ లీక్

RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం తెల్సిందే. విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోవడమే చరణ్ మొదటినుంచి పాటిస్తున్న నియమం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. తాజాగా చరణ్ నటిస్తున్న చిత్రం RC16. బుజ్జిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఇక  ఈ సినిమా కోసం చరణ్ మేకోవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. గుబురు గడ్డం.. పొడవైన జుట్టు.. చెవికి పోగు. రంగస్థలం సినిమాలో చరణ్ ఎలా అయితే కనిపించాడో.. ఈ సినిమాలో అలానే కనిపించనున్నాడు.  ఎప్పటినుంచో ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా RC16 సెట్ లో ఒక గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ ను చూసి అభిమానుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇంతకు అంత పెద్ద గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా.. మెగా వారసురాలు క్లింకార కొణిదెల. ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్ కు పదేళ్ల తరువాత పుట్టిన పాప క్లింకార. కూతురు పుట్టిన దగ్గరనుంచి చరణ్ లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి.


ప్రతిరోజు కూతురుకు తానే దగ్గరుండి అన్నం తినిపిస్తాడట చరణ్. ఆమెను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడు. కూతురును చూడడం కోసమే అవుట్ డోర్ షూటింగ్స్ కూడా తగ్గించేశాడట. షూటింగ్ ఎప్పుడు  పూర్తవుతుందా ఎప్పుడు క్లింకార వద్దకు వెళ్లాలా అని ఎదురుచూస్తాను అని చరణ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి.. ముదిరితే పక్షవాతం.. ?

తాజాగా మెగా వారసురాలు క్లింకార కొణిదెల RC16 సందడి చేసింది. తండ్రి చరణ్ తో కలిసి సెట్ మొత్తం తిరిగేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను చరణ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ” సెట్ లో  నా చిన్నారి అతిధి” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. చరణ్  క్లింకార ను ఎత్తుకొని ఉండగా.. చిన్నారి క్లింకార ఎటో చెయ్యి చూపిస్తూ  కనిపించింది. అయితే ఆమె ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఎప్పుడైతే తనను నాన్న అని పిలుస్తుందో  అప్పుడే క్లింకార ముఖాన్ని రివీల్ చేస్తాను అని చరణ్ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

నేటి ఉదయమే RC16 షూటింగ్ లో చరణ్ అడుగుపెట్టినట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు చరణ్.. తన కూతురుతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో లొకేషన్ చూస్తుంటే.. జాతర సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జాతర సీన్స్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక బుచ్చిబాబు ఈసారి చరణ్ నట విశ్వరూపం చూపించబోతున్నాడు అని తెలిసిపోతుంది. మరి ఈ సినిమాతో  చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×