BigTV English

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

DGP Warns Netizens: పోలీసు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో రంగంలోకి దిగేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి గట్టి హెచ్చరిక ఇచ్చారు. వీటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నది డీజీపీ మాట.


ఏపీలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరుగుతోంది. మనషులను వేధించడం తీవ్రమవుతోంది. వీటి వల్ల కొన్ని కుటుంబాలు మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి. వీటిని కంట్రోల్‌ చేసేందుకు ఫోకస్ చేసింది కూటమి సర్కార్.

ఈ నేపథ్యంలో జిల్లాకొక సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు స్వయంగా చెప్పుకొచ్చారు. అనంతపురం వచ్చిన ఆయన, మీడియా తో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో మనుషులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.


మనషులను మానసికంగా బాధ పెట్టేలా సైబర్ క్రైమ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు డీజీపీ. కుటుంబాలు విచ్ఛిన్న కావడం, మనో వేధనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు.

ALSO READ:  విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇలాంటివి ఉన్నట్లయితే మానుకోవాలని సున్నితంగా నెటిజన్స్‌ను హెచ్చరించారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి జవాబుదారీగా ఉండాలన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు.

గంజాయి, నార్కోటిక్స్ వ్యవహారం పోలీసుశాఖకు ఛాలెంజ్‌గా మారిందన్నారు డీజీపీ. వీటిని కంట్రోల్ చేసేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. నార్మల్‌గా ఉండే క్రైమ్‌ని కంట్రోల్ చేస్తున్నామని తెలిపారు.

ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ పెరిగినట్టు చెప్పిన డీజీపీ, కొత్త పద్దతులు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అంటూ బాధితులను బెదిరిస్తున్నారని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెపరేట్‌గా కామెంట్ చేయనన్నారు.

ఐజీ సంజయ్‌పై విచారణ జరుగుతోందని, దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని, ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇస్తామన్నారు.

టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛా అంటూ నీరు గర్చారని గుర్తు చేశారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని వివరించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం, నేతలపై ఫేక్, మార్ఫింగ్‌తో రెచ్చిపోతున్నారు కొందరు. కేసులు పెట్టినా, హెచ్చరించినా వారు మాత్రం తమ పంథాను వీడలేదు.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×