Big Stories

CSK Vs SRH Full Highlights: హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ వింతలు.. విశేషాలు..!

Chennai Super Kings Vs Sunrisers Hyderabad Full Match Highlights: హైదరాబాద్ సన్ రైజర్స్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆకాశమంత ఎత్తు ఎగిరి, ఒక్కసారి దభీమని కిందకు పడింది. ఐపీఎల్ లో అత్యధిక పరుగులతో రికార్డు సాధించి, ఇప్పుడు 78 పరుగుల భారీ తేడాతో ఓడి, మరో చెత్త రికార్డు సాధించింది.  2013లో ఇదే చెన్నయ్ చేతిలో 77 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడొక పరుగు పెరిగింది.

- Advertisement -

ఇక చెన్నయ్ వైపు చూస్తే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ధోనీ సేన, మళ్లీ వ్యూహాత్మకంగా ఆడి, హైదరాబాద్ ని నిలువరించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగు రెండు విభాగాల్లో రాణించి విజయం సాధించింది. మళ్లీ రేసులోకి వచ్చింది. ఇకపోతే ఈ మ్యచ్ సందర్భంగా కొన్ని వింతలు, విశేషాలు ఏమిటంటే..

- Advertisement -

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ తర్వాత రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా హైదరాబాద్ రికార్డులకి ఎక్కింది.

Also Read: వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు.. నేడు కోల్ కతా తో మ్యాచ్

నిజానికి ఐపీఎల్ సీజన్ లో ప్రతి జట్టులో టాప్ ఆర్డర్ చితక్కొట్టేస్తున్నారు. 3 లేదా 4 వికెట్లకే మ్యాచ్ ని ముగిస్తున్నారు. ఆల్ అవుట్ అవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతోంది. 17వ సీజన్ లో హైదరాబాద్ తొలిసారి ఆలౌట్ అయ్యింది. అలాగే చెన్నయ్ కూడా తొలిసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.

క్రికెట్ మ్యాచ్ ల్లో రికార్డులు ఏమిటో గానీ, అంతా వేలం వెర్రిలా ఉంది. ప్రతీది విచిత్రంగానే చెబుతున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ లో 9 మంది బ్యాటర్లు క్యాచ్ ల ద్వారా అవుట్ అయ్యారు. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో మూడోసారి. ఇక హైదరాబాద్ కి మాత్రం తొలిసారి అని చెప్పాలి.

Also Read: T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ ఇవే..

ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రెండో ఆటగాడిగా డారిల్ మిచెల్ నిలిచాడు. హైదరాబాద్ పై 5 క్యాచ్ లు పట్టాడు.

టీ 20 ప్రపంచ క్రికెట్ చరిత్ర లో 200 ప్లస్ స్కోర్లు అత్యధికంగా సాధించిన జట్టుగా చెన్నయ్ నిలిచింది. ఇప్పటివరకు 35 సార్లు చేసింది. అయితే దీని తర్వాత వరుసగా సోమర్సెట్ (34), భారత్ (32), బెంగళూరు (31), యార్క్ షైర్ (29), సర్రే (28) ఇలా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News