BigTV English

Brain Surgery : ‘పోకిరి’ సినిమా చూపించి బ్రెయిన్ సర్జరీ.. గుంటూరు ప్రభుత్వ వైద్యుల రికార్డ్..

Brain Surgery: గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో న్యూరో సర్జరీ వైద్యులు బ్రెయిన్ సంబంధిత వ్యాధి సోకిన పేషంట్ కు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు.

Brain Surgery : ‘పోకిరి’ సినిమా చూపించి బ్రెయిన్ సర్జరీ.. గుంటూరు ప్రభుత్వ వైద్యుల రికార్డ్..

Brain Surgery: గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో న్యూరో సర్జరీ వైద్యులు బ్రెయిన్ సంబంధిత వ్యాధి సోకిన పేషంట్ కు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండుకు వైద్యులు ఈ సర్జరీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీ చేసి వైద్యులు రికార్డ్ సృష్టించారు. పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న బ్రెయిన్‌ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వైద్యులు ప్రకటించారు.


పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన కోటిపండు కాలు, చేయి బలహీనపడి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో జనవరి 2న కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేర్చారు. స్కానింగ్‌లో అతని మెదడులోని మోటార్‌ కార్టెక్స్‌ అనే భాగంలో కణితి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అత్యంత సున్నితమైన భాగం కావడంతో దానిని తొలగించే క్రమంలో రోగి కుడి కాలు, చేయి చచ్చుబడే ప్రమాదం ఉందని.. వైద్యులు కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించారు. ఆపరేషన్‌ సమయంలో రోగిని మెలకువగా ఉంచాలని వైద్యులు భావించారు. అతని కాళ్లు, చేతుల కదలికలను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించాలని న్యూరో వైద్యులు నిర్ణయించుకున్నారు.

జనవరి 25న రోగికి లోకల్‌ అనస్థీషియా ఇచ్చి ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా వైద్యులు పూర్తి చేశారు. కోటిపండుకి హీరో మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం. దీంతో అతనికి ల్యాప్‌ట్యాప్‌లో ‘పోకిరి’ సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ చేశారు. ఆపరేషన్‌ చేసిన వైద్య బృందానికి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. సర్జరీ అనంతరం రోగి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. గతంలో కూడా ఇలాంటి సర్జరీలు చాలానే జరిగాయి.


గతంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇటువంటి అరుదైన శస్త్ర చికిత్సను చేసి రికార్డ్ సాధించారు. ఓ యాభై ఏళ్ళ మహిళకు ట్యాబ్‌లో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు ఆమెతో మాట్లాడుతూ రెండు గంటల పాటు సర్జరీ చేసారు. ఇటీవల ఓ పదేళ్ళ పాపకు మెదడులో కణితి ఉండటంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తే ప్రమాదం ఉందని భావించిన వైద్యులు.. తనకు ఇష్టమైన కాండీక్రష్ గేమ్ ఆడుకోమని చెప్పి ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇంతకు ముందు కూడా ఓ పేషెంట్‌ వయోలిన్ ప్లే చేస్తూ ఉండగా.. డాక్టర్లు బ్రెయిన్ ఆపరేషన్ చేసి రికార్డ్ సృష్టించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×