Tirumala Benefits: మీరు శ్రీవారి భక్తులా.. ఏడాదికి ఒకసారి శ్రీవారిని మీ కుటుంబంతో కలిసి నేరుగా దర్శించుకోవాలా? అయితే ఈ వివరాలు మీకోసమే. ఒక్కసారి మీరు ఇలా చేస్తే చాలు, మీ జీవితాంతం ఈ సేవను మీరు పొందవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఈ వివరాలు తెలుసుకోండి. శ్రీవారి దర్శనభాగ్యం పొందండి.
వేలాది భక్తుల రాక..
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఎందరో భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మాడ వీధులు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాదు ఎందరో శ్రీవారి భక్తులు గోవిందా నామస్మరణ సాగిస్తూ, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాన కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అలాగే తమ మొక్కుల తీరిన వెంటనే శ్రీవారి హుండీలో కానుకలు సమర్పిస్తారు.
అధిక విరాళాలు..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా విరాళాలు స్వామి వారికి సమర్పిస్తారు. ఇటీవల భక్తులు ఎందరో కోట్ల రూపాయాలలో విరాళాలు సమార్పిస్తూ, తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా, శ్రీవారి ఆలయానికి విరాళాలు సమర్పించే వారు అధికారిక టీటీడీ వెబ్ సైట్ ద్వారా కానీ, లేక నేరుగా టీటీడీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలి.
విరాళం చెల్లిస్తే సదుపాయాలు ఎన్నెన్నో..
శ్రీవారికి భారీగా విరాళం చెల్లించిన భక్తులకు టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. విరాళం చెల్లించిన నగదును బట్టి వారికి టీటీడీ సౌకర్యాలు కల్పిస్తుంది. ఒక్కసారి స్వామి వారికి భారీ మొత్తంలో విరాళం చెల్లిస్తే చాలు, నేరుగా శ్రీవారిని దర్శించే భాగ్యం కూడా దక్కుతుంది. భక్తులు విరాళాల రూపంలో సమర్పించిన నగదును ఎన్నో సేవా కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఖర్చు చేస్తుంది.
కేవలం రూ. లక్ష చెల్లిస్తే..
శ్రీవారి ఆలయానికి కేవలం లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు టీటీడీ అందించే సదుపాయాలు ఎన్నెన్నో అని చెప్పవచ్చు. ఒకేసారి శ్రీవారి ఆలయానికి లక్ష చెల్లించిన భక్తులకు వారి జీవితాంతం శ్రీవారి సేవలో ఉండే భాగ్యం కలుగుతుంది. విరాళం అందించిన భక్తుడితో పాటు వారి కుటుంబసభ్యులు నలుగురు కలిసి ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా శ్రీవారిని నేరుగా దర్శించవచ్చు. అంతేకాదు స్వామి వారి దర్శనార్థం వచ్చిన సమయంలో కేవలం రూ. 100 లకే గది సౌకర్యం, 6 లడ్లు, ఒక దుప్పట అందజేస్తారు. అంతేకాదు ఐటీ డిటెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
ఎలా చెల్లించాలి?
టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పిలిగ్రాం సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, అక్కడ విరాళం అందించవచ్చు. లేకుంటే నేరుగా టీటీడీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి అధికారిక టీటీడీ అధికారులకు నగదు చెల్లించి రశీదు పొందాలి. అప్పుడు మీకు ఏయే సదుపాయాలను టీటీడీ కల్పిస్తుందో అక్కడ అన్నీ వివరిస్తారు. మరెందుకు ఆలస్యం కేవలం రూ. లక్ష విరాళం అందిస్తే, లైఫ్ లాంగ్ స్వామి వారి దర్శనభాగ్యంను నేరుగా పొందే అవకాశం ఇది. డోంట్ మిస్ దిస్ ఛాన్స్.