Odela 2 OTT: మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ రోల్ లో నటించిన ఓదెల 2 మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీ లోకి రానుంది. తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట, మురళీ శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వచ్చిన ఓదెల 2 బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ టాక్ తో సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ మూవీ బుల్లితెరపై సందడి చేయడానికి ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఎప్పుడు.. ఎందులో అనే వివరాలు చూద్దాం..
ఆ ఓటీటీ లో కొన్ని రోజులు మాత్రమేనా …
తమన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నాగ సాధువుగా, తమన్నా నటించి అందరినీ మెప్పించింది. మొదటి భాగం ఎక్కడైతే ముగించారో ఈ సీక్వెల్ అక్కడి నుంచి మొదలవుతుంది. సంపత్ నంది కథను అందించగా.. అశోక్ తేజ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తిరుపతి క్యారెక్టర్ లో చేసిన వశిష్ట బయపెట్టాడని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మే 16 లేదా 17 నుంచి అందుబాటులో రానుంది. మే సెకండ్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహాలో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక రెండు ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు సమాచారం.కేవలం అమెజాన్ ప్రైమ్ లో 4 వారాల మాత్రమే స్ట్రీమింగ్ ఒప్పందం జరిగినట్టు సమాచారం.
తమన్నా పాత్ర కు ప్రశంసలు ..
సంపత్ నంది ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. గతంలోనే ఇటువంటి జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్ గా నిలవగా.. కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ జోనర్లో హిట్ అయిన సినిమాలు అరుంధతి, అఖండ. ప్రేతాత్మతో నాగసాధువు పోరాటాన్ని సంపత్ నంది చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. కానీ కథనంలో లోపంతో సినిమా పవర్ ఫుల్ గా చూపించిన ఆశించిన స్థాయిలో మెప్పించ లేక పోయింది. ఇక నాగ సాధువుగా తమన్న యాక్టింగ్ మాత్రం అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
కథ ఇలా సాగింది ..
కధ లో నవవధువుపై అత్యాచారాలకు పాల్పడుతున్న తిరుపతిను అతని భార్య రాథ చంపేస్తుంది. ప్రేతాత్మగా మారిన తిరుపతి ఓదెల గ్రామ ప్రజల మీద పగతో రగిలిపోయి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇద్దరు నవ వధువులను అతి దారుణంగా చంపేస్తాడు. తిరుపతి బారి నుండి గ్రామ ప్రజలను కాపాడడానికి తమన్నా భైరవిగా వస్తుంది. ఆమె తిరుపతితో ఎలా పోరాడింది. మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు? ప్రేతాత్మకు నాగ సాధువుకు మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందనేది తెలియాలంటే మూవీ మొత్తం చూడాల్సిందే, ఇక ఇప్పటికే ఈ మూవీ మొదటి పార్ట్ 2022లో వచ్చి సక్సెస్ ని అందుకుంది. రెండవ పార్ట్ గా వచ్చిన ఓదెల 2 ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఓదెల 2 కి సీక్వెల్ గా మూడో పార్ట్ కూడా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో బన్నీ హీరోయిన్… ఇంక ఎంతమంది ఉన్నారయ్య అనిల్