OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలల తరువాత ఓటీటీలోకి రాబోతోంది ఓ మలయాళ మూవీ. ఎలాంటి బజ్ లేకుండా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. వచ్చే వారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. మరి ఈ మలయాళ థ్రిల్లర్ ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం పదండి.
మూడు నెలల తరువాత ఓటీటీలోకి
మలయాళ థ్రిల్లర్ ‘పరాన్ను పరాన్ను పరాన్ను చెల్లన్’ (Parannu Parannu Parannu Chellan). జిష్ణు హరీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో రిలీజై, మూడు నెలలు గడిచాక ఓటీటీలోకి అడుగు పెట్టబోతుండడంతో ఆసక్తి నెలకొంది.
కథ ఏంటంటే?
గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. విషయాన్ని పెద్దల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు. కానీ ప్రియురాలి కుటుంబం అతన్ని రిజెక్ట్ చేస్తుంది. దీంతో అవమానంగా భావించే ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఇంకేముంది తన ప్రియురాలితో పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. కేవలం ప్రేమికురాలిని దక్కించుకుందాం అని కాదు, తనను రిజెక్ట్ చేసిన ఆమె ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకోవాలి అనేది అతని ప్లాన్.
కానీ వాళ్ళు అలా పారిపోవడం కొత్త సమస్యలను క్రియేట్ చేస్తుంది. ఈ జంట కోసం వెతకడం మొదలు పెట్టాక ఊహించని సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. దిగ్భ్రాంతికరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ లవ్ స్టోరీ నెమ్మదిగా ప్రేమకథ నుండి దిమ్మతిరిగే టర్న్స్, ట్విస్ట్ లు ఉన్న ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. అసలు ఆ అబ్బాయిని ఎందుకు అమ్మాయి తరపు వారు రిజెక్ట్ చేశారు? మరి బయట పడ్డ ఆ రహస్యాలు ఏంటి? చివరికి ఆ ప్రేమ జంటను పెద్దలు పట్టుకోగలిగారా? అబ్బాయి పగ తీరిందా? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
Read Also : రాజుతో ఆ పని కోసం ముసలమ్మల ఆరాటం… కాటికి కాళ్ళు చాపే వయసులో ఇవేం పాడు పనులురా సామీ
ఇదిలా ఉండగా ‘పరన్ను పరన్ను పరన్ను చెల్లన్’ సినిమాలో సజిన్ చెరుకైల్, దాసన్ కొంగాడ్, సమృద్ధి తార, విజయరాఘవ, శ్రీజ దాస్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు నటించారు. జె.ఎం. ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు జాయ్ జినిత్ అండ్ రామ్‌నాథ్ సంగీతం సమకూర్చగా, జాయ్ జినిత్ నేపథ్య సంగీతం కూడా అందించారు.