Dwarampudi Chandrasekhar Reddy: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పీడీఎస్ బియ్యంపై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సార్ మీ కొండబాబును అరికట్టి కాకినాడ పోర్టును కాపాడండి. సింగిల్ నెంబర్లు ఆడించి నెల నెలా వసూళ్లు చేస్తున్నాడు. ఇప్పటికే కాకినాడ పోర్టు దివాళా తీసింది. ఉన్న ఎక్స్ పోర్టర్లంతా వెళ్లిపోయారు. ఈ జనవరి నుంచి ఆ అరా కొరా కూడా వెళ్లిపోతారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. తమది బేసిగ్గా పీడీఎస్ వ్యాపారం కాదనీ.. పూర్తిగా రైస్ బిజినెస్ అని స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలోనూ తన తండ్రి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేశారనీ. తాను కానీ తన కుటుంబం కానీ రేషన్ బియ్యం వ్యాపారం లేదని అన్నారు ద్వారంపూడి. ఎక్కడ కంట్రోల్ చేస్తే బావుంటుందో అక్కడ చేయమని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపు బియ్యం వ్యాపారం చేసే వారి నుంచి మీ కొండబాబే ఐదు లక్షలు వసూలు చేస్తున్నారనీ.. లంచాలు తీస్కోవడం మానేస్తే ప్రశ్నించే ధైర్యమొస్తుందని అన్నారు ద్వారంపూడి. కాకినాడ పోర్టుపై ఎక్కువ దృష్టి పెట్టి చెడ్డపేరు తీసుకురావద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండబాబు.
ఇప్పటికే ద్వారంపూడి రేషన్ బియ్యం దందాపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఆ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడితో ఆగకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ కు చెందిన ఇతర వ్యాపారాలు, వ్యాపకాలలో నిబంధనల ఉల్లంఘనపై కూడా నిఘా పెట్టింది. అందులో భాగంగానే తాజాగా ఆయనకు చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమలో నింబంధనల ఉల్లంఘనలను గుర్తించి మూసి వేయించింది. సమగ్ర విచారణ, దర్యాప్తులను సత్వరమే నిర్వహించి ద్వారంపూడి వ్యాపారాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు అధికారులు.
Also Read: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు ఔట్?
మరోవైపు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో వేగంగా దర్యాప్తు సాగుతోంది. బలవంతంగా వాటాలు లాక్కున్నారన్న ఆరోపణలపై సీఐడీ విచారిస్తోంది. ప్రజా పంపిణీ బియ్యం అక్రమరవాణా పై సిట్ అధికారులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. వాటాలు లాక్కున్నారన్న ఆరోపణలపై …కాకినాడ పోర్ట్ నుంచి 52 ఫైల్స్ తో పాటు పలు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
వాటాల బదలాయింపునకు ముందు ఆర్థిక పరిస్థితులు, వాటాలు ఇవ్వడానికి కారణాలు, అప్పట్లో రుణాలు ఇచ్చిన బ్యాంకుల రియాక్షన్ లు, ప్రభుత్వానికి కట్టవలసిన వాటాలో అవకతవకలు వంటి అంశాల చుట్టూ దర్యాప్తు కేంద్రీకృతం అయినట్లు సమాచారం. మరోవైపు.. నేడో, రేపో సిట్ టీమ్ సమావేశం కానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని సభ్యులు విశ్లేషించుకోనున్నారు. 15 రోజుల్లో ప్రాథమిక విచారణ నివేదికను సిట్ అందించనుంది.