BigTV English

Earn Money: చెట్లకు డబ్బులు.. త్వరపడండి.. డోంట్ మిస్!

Earn Money: చెట్లకు డబ్బులు.. త్వరపడండి.. డోంట్ మిస్!

Earn Money: డబ్బు లేని జీవితం నేటి రోజుల్లో సాగడం కష్టమే. కానీ ఆ డబ్బు సంపాదనకు మనం పడే కష్టాలు వేరు. అయితే కొందరు అక్రమ మార్గాలలో తెగ కూడబెట్టుకుంటారు అది వేరు. కానీ సక్రమ మార్గంలో డబ్బు సంపాదించినదే మన సొంతం. అయితే పాత రోజుల్లో మన పూర్వీకులు.. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటూ తరచూ చెప్పేవారు. ప్రస్తుతం అదే పరిస్థితి నేటి ఆధునిక కాలంలో ఉంది. ఔను.. చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదివితే, మీరు చెట్ల నుండి డబ్బు టక్కున తీసుకోవచ్చు.


చెట్లకు డబ్బులు.. త్వరపడండి.. ఆర్థిక లాభాలతో పాటు ప్రకృతికి రక్షణ.. ఇప్పుడు ఇది అందరికీ సాధ్యమే. చెట్లు నాటితే ఆక్సిజన్ వస్తుందనే మాట ఇప్పుడు సరిపోదు. చెట్లు నాటితే డబ్బులు వస్తాయన్న మాటే ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉంది. గ్రీన్ బిజినెస్, కార్బన్ క్రెడిట్స్, టిమ్‌బర్ మార్కెట్, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల రూపంలో చెట్లు ఇప్పుడు డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. ప్రకృతిని కాపాడుతూ ఆదాయం పొందాలనుకునే యువత, రైతులు, ఇంజనీర్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి, మీరు కూడా డబ్బులిచ్చే ఈ చెట్ల ప్రయాణంలో చేరదలిస్తే ఇలా చేయండి.

చెట్లతో ఆదాయం ఎలా?
టిమ్‌బర్ చెట్ల సాగు, ఫ్రూట్ ప్లాంటేషన్, కార్బన్ క్రెడిట్స్ వంటి అనేక మార్గాల్లో చెట్లు ఆదాయం తెచ్చిపెడతాయి. ప్రత్యేకించి అరణ్య ప్రాంతాలలో, భూములు ఉన్నవారు ఈ అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.


టింబర్ చెట్ల సాగు.. వ్యవసాయం కన్నా లాభదాయకం
టేక్, సగవాన్, మల్బరీ, రోజ్ వుడ్ వంటి చెట్లను 10 నుండి 15 ఏళ్ల కాలానికి సాగుచేస్తే, ఒక్క చెట్టు నుంచి రూ.10,000 నుండి రూ.50,000 వరకు లాభం పొందవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇది ప్రభుత్వ అనుమతితో సాగుచేయవచ్చు. పెట్టుబడి తక్కువగా ఉండటం, నీటి అవసరం తక్కువగా ఉండటం వల్ల ఇది రైతులకు అద్భుత అవకాశం. ఇలా చేస్తే డబ్బులే డబ్బులు.

కార్బన్ క్రెడిట్స్..
పరిశుభ్ర వాతావరణం కోసం కార్బన్ కాలుష్యాన్ని తగ్గించే వ్యక్తులు, సంస్థలు, దేశాలు కార్బన్ క్రెడిట్స్ పేరుతో డబ్బులు చెల్లిస్తున్నారు. మీరు పెంచే చెట్లు ఎక్కువ కార్బన్‌ను గ్రహిస్తే, ఆ డేటాను సర్టిఫై చేయించుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో కార్బన్ క్రెడిట్లుగా అమ్మొచ్చు. కొన్ని సంస్థలు లక్ష చెట్లకూ రూ.లక్షల ఆదాయం అందిస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు, కంపెనీలు CO₂తో వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంటాయి. ఈ కార్బన్ వాయువు పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అందుకే ఎంత కార్బన్ విడుదల చేశారో, అంత కార్బన్ తగ్గించే ప్రయత్నం చేయండి. లేకపోతే అది తగ్గించే వాళ్లకు డబ్బులు చెల్లించండి అనే విధానం అమలవుతోంది.

పరిసరాల పరిరక్షణ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు
చెట్లు నాటే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత నర్సరీలు, ప్రోత్సాహక గిరాకీలు అందిస్తున్నాయి. పచ్చదనం పెంచే కార్యక్రమాల్లో పాల్గొనేవారికి పతకాలు, వృత్తిపరమైన గుర్తింపులు లభిస్తున్నాయి. దీనితో వారికి ప్రభుత్వం నుండి సకల సదుపాయాలు కలుగుతున్నాయి. ఇలాంటి వారిలో ఇటీవల కన్నుమూసిన వనజీవి రామయ్య ఒకరు. ఈయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

సిటీ స్టార్టప్‌లలో చెట్లతో పస్సివ్ ఆదాయం
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో యువత ‘గ్రీన్ బాంకింగ్’, ‘అడాప్ట్ ఎ ట్రీ’ అనే కాన్సెప్ట్‌ లపై ఆధారపడుతూ కొత్త బిజినెస్‌లను ప్రారంభిస్తున్నారు. మీ ఇంటి వాకిలిలో ఉన్న చెట్టుకే QR కోడ్ పెట్టి దానిని సంరక్షించాలనుకునే వ్యక్తులకు వార్షిక చందా అందిస్తారు. ఇలా పల్లెలో చిన్న చెట్టుతో పట్టణంలో ఆదాయం పొందవచ్చు.

గ్రీన్ మిషన్‌తో ఉపాధి అవకాశాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు పచ్చదనం కోసం గ్రీన్ మిషన్ లపై పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. గ్రామాల నుండి పట్టణాల వరకు లక్షలాది మంది చెట్ల పెంపకంలో ఉపాధి పొందుతున్నారు. మొక్కల నర్సరీలు, ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్, ట్రాకింగ్, వృక్ష శాస్త్రం వంటి రంగాల్లో నూతన ఉద్యోగాలు వచ్చిపడుతున్నాయి.

Also Read: Cashless Village: డబ్బే అవసరం లేని గ్రామం మన దేశంలో.. ఈ ఊరే వేరే లెవెల్!

చివరగా…
చెట్టు కొడితే జరిమానా వేస్తారన్న కాలం మొదలైంది. మీరు నాటి చెట్టుకు నీరు పోస్తే, అది మీకు డబ్బును ఇస్తుంది. ప్రకృతిని కాపాడడం, భవిష్యత్తు తరాలకు శ్వాసనివ్వడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఈ మూడు లక్ష్యాలను ఒకేసారి చేరుకోవాలంటే, చెట్లనే నమ్మండని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక ఆలస్యం వద్దు.. చెట్లకు డబ్బులు వస్తున్నాయి, త్వరపడండి.. ఇంకా సమాచారం కోసం కేంద్ర అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అంతేకాకుండా మీ దగ్గరలోని పర్యావరణ వేత్తలను సంప్రదించినా చెట్లకు డబ్బులు వచ్చే ఐడియాలు మీ ముందు ఉన్నట్లే!

Related News

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Big Stories

×