సత్యరాజ్ (Satyaraj).. కట్టప్ప అనగానే వెంటనే గుర్తుపడతారు. బాహుబలి (Bahubali )సినిమా మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో బాహుబలి 2 ని కొనసాగించి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సత్యరాజ్.. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కి తండ్రిగా నటించారు. అలాగే ‘ప్రతిరోజు పండగే’ సినిమాలో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కి తాతయ్యగా కూడా నటించిన ఈయన కెరియర్ తొలిరోజుల్లో విలన్ పాత్రలు పోషించి, ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు.
నాలుగేళ్లుగా కష్టం అనుభవిస్తున్న సత్యరాజ్..
ప్రస్తుతం సత్యరాజ్ రజనీకాంత్ (Rajinikanth)హీరోగా నటిస్తున్న ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే సత్యరాజ్ గుండెల్లో అంతులేని భారం మోస్తూ పైకి ప్రేక్షకులను నవ్విస్తున్నారు. గత నాలుగేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఆయన అనుభవించే నరకం ఇంకొకరు తీర్చరానిది. అయితే ఈ విషయాలు ఆయన చెప్పకపోతే ఎప్పటికీ తెలిసేది కాదేమో.. కానీ ఆయన కూతురు ఒక్కసారిగా ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన సత్యరాజ్ అభిమానులే కాదు సినీ సెలెబ్రెటీలు, ప్రేక్షకులు కూడా సత్యరాజ్ ఇంత కష్టం అనుభవిస్తున్నారా అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
కోమాలో భార్య.. కూతురు ఎమోషనల్ పోస్ట్..
తాజాగా సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ (Divya Satyaraj) తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “మా అమ్మ గత నాలుగు సంవత్సరాలుగా కోమాలోనే ఉంది. ఆమెకు PEG ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. ఆమె కోలుకుంటుంది అనే ఆశతోనే మేము ఎదురు చూస్తున్నాము. మా అమ్మ మమ్మల్ని తిరిగి కలుస్తుంది అని , ఎప్పటిలాగే మాతో ఉంటుందని ఒక చిన్న ఆశ. అమ్మలేని ఈ రోజులు మాకు అత్యంత నరకప్రాయంగా అనిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మాకు అమ్మ లేని లోటును నాన్నే తీరుస్తున్నారు. మా నాన్న కూడా కొన్నేళ్ల క్రితం తన తల్లిని కోల్పోయారు. దీంతో నేను మా నాన్నకు సింగిల్ మామ్ గా ఉన్నాను. మా నాన్న నేను పవర్ ఫుల్ సింగిల్ మామ్స్ క్లబ్లో ఉన్నాము అంటూ ఆమె రాసుకు వచ్చింది. దీంతో సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలోని బాధ తెలిసి ఆయన అభిమానులందరూ చలించిపోతున్నారు.
సత్యరాజ్ నటించిన చిత్రాలు..
ఇకపోతే సత్యరాజ్ , మహేశ్వరి ఇద్దరూ 1979 లో వివాహం చేసుకున్నారు. వీరికి సిబిరాజ్ అనే కుమారుడు, దివ్య అనే కుమార్తె కూడా ఉన్నారు. సత్యరాజ్ సినిమాల విషయానికొస్తే.. భారతీయ రాజా ‘సముద్రతీర పద్యాలు’ మూవీతో విలన్ గా భారీ ఇమేజ్స్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కడలోరా కవికాగలు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సత్యరాజ్ ఆ తర్వాత వాల్టర్ వెట్రివేల్, మిస్టర్ భరత్, మక్లక్ ఎన్ ఫాపా, బాహుబలి, రిక్షా మామ, పెరియార్ వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.